Bigg Boss Non Stop: తొలి రోజే ఊహించని ఓటింగ్.. బిందు మాధవికి భారీ దెబ్బ.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

అసలే మాత్రం ప్రేక్షకాదరణను ఊహించకుండానే తెలుగులోకి ప్రవేశించిన షో బిగ్ బాస్. కానీ, ఆరంభం నుంచే ఇది వినూత్నంగా సాగుతూ అందరికీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటింది. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇవన్నీ ఒక దానికి మించి ఒకటి రేటింగ్‌ను రాబట్టాయి. ఫలితంగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ జోష్‌లోనే ఇప్పుడు నిర్వహకులు ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌ను మరింత కొత్తగా నడుపుతున్నారు. ఇది చివరి దశకు చేరుకోవడంతో 11వ వారం ఓటింగ్‌పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో అసలు ఈ వారం ఏ కంటెస్టెంట్‌ ఏ పొజిషన్‌లో ఉన్నాడో చూద్దాం పదండి!

చివరి దశలో మరింత మస్తీగానే

చివరి దశలో మరింత మస్తీగానే

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలను చూపించారు. ఫలితంగా పాత సీజన్ల కంటే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో మస్తీగా సాగుతోంది.

ఇప్పటికే 10 మంది ఎలిమినేట్

ఇప్పటికే 10 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డిలు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

అలా పంపడంతో ఆసక్తికరంగా

అలా పంపడంతో ఆసక్తికరంగా

బిగ్ బాస్ షో అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇది ఊహించని విధంగా సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో అంచనాలతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే వెళ్లిపోయారు. ఫలితంగా అందరిలో ఆసక్తి మరింత ఎక్కువ అవుతోంది.

11వ వారం నామినేషన్‌ వీళ్లే

11వ వారం నామినేషన్‌ వీళ్లే

ఎన్నో గొడవలతో రంజుగా సాగిన 11వ వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. ఫినాలేకు ముందు వారం కావడంతో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివ, నటరాజ్‌ మాస్టర్‌లను నామినేట్ చేసినట్లు బిగ్ బాస్ పేర్కొన్నాడు.

బిందు మాధవికి షాక్.. అతడే

బిందు మాధవికి షాక్.. అతడే


పదకొండో వారంలో అందరూ నామినేట్ అవడంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి నుంచీ టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటోన్న బిందు మాధవికి మాత్రం ఈ వారం తక్కువ ఓట్లు పోలైనట్లు తెలిసింది. దీంతో ఆమె రెండో స్థానానికే పరిమితం అయిందని తెలిసింది. ఇక, మరో ఫేవరెట్ అఖిల్ సార్థక్ మొదటి రోజు టాప్‌లో కొనసాగుతున్నాడని టాక్.

మిగిలిన వాళ్లు ఓటింగ్ ఇలాగే

మిగిలిన వాళ్లు ఓటింగ్ ఇలాగే

11వ వారం జరుగుతోన్న ఓటింగ్‌లో అఖిల్, బిందు తర్వాత యాంకర్ శివకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు మూడో స్థానంలో ఉన్నాడని సమాచారం. ఇక, మిత్రా శర్మ నాలుగో స్థానంలోనూ, నటరాజ్ మాస్టర్ ఐదో స్థానంలోనూ కొనసాగుతున్నారని తెలిసింది. ఇక, మరో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ మాత్రం ఆరో స్థానానికే పరిమితం అయిందట.

ఈ వారం డేంజర్ జోన్‌‌లో వీళ్లే

ఈ వారం డేంజర్ జోన్‌‌లో వీళ్లే

11వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో మొదటి రోజు ముగిసే సమయానికి స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్లు అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలిసింది. వీళ్లిద్దరికే చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌లో బాబా ఏడో స్థానంలో, అనిల్ ఎనిమిదో స్థానంలో ఉన్నారట. చివరి ఈ పొజిషన్స్ మారే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X