Bigg Boss Elimination: బిందు ఓట్లన్నీ అతడికే.. అఖిల్‌కు మరోసారి దెబ్బ.. ఈ సారి ఆ ఇద్దరిలో ఒకరు ఔట్

కష్టతరమైన పరిస్థితుల నడుమ తెలుగులోకి పరిచయమైనా.. ఎవరూ ఊహించని రీతిలో ఆరంభంలోనే మంచి స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో.. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే రికార్డు స్థాయి రేటింగ్‌ను అందుకుంటోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది.

ఈ ఉత్సాహంతోనే ఐదు సీజన్ల తర్వాత నిర్వహకులు ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను మొదలెట్టారు. ఇది కూడా జనరంజకంగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8వ వారం ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

ఎప్పటికప్పుడు ఆసక్తిగా సాగుతూ

ఎప్పటికప్పుడు ఆసక్తిగా సాగుతూ

తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందనను దక్కించుకుంటూ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నా దీనికి అదే రీతిలో ఆదరణ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో బోల్డు కంటెంట్‌ను చూపించడంతో పాటు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. అలాగే, ఎప్పటికప్పుడు ట్విస్టులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఇది మరింత రంజుగా సాగుతోంది.

7 వారాల్లో.. ఏడుగురు బయటకు

7 వారాల్లో.. ఏడుగురు బయటకు

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఈ సారీ గొడవలతో నామినేషన్స్

ఈ సారీ గొడవలతో నామినేషన్స్

బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో టాస్కుల సమాహారం. అన్నింటి కంటే ఇందులో నామినేషన్స్ టాస్క్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారానే హౌస్‌లో ఎవరిని ఉంచాలి? ఎవరిని పంపాలి అన్నది డిసైడ్ అవుతుంది. అందుకే ఇది ఎన్నో గొడవలతో సాగుతుంది. ఈ వారం కూడా అలాగే జరిగి.. ఇందులో బిందు, అఖిల్, అజయ్, అషు, హమీదా, అనిల్ నామినేట్ అయ్యారు.

బాబా భాస్కర్ వల్ల ఆమె సేఫ్‌గా

బాబా భాస్కర్ వల్ల ఆమె సేఫ్‌గా

ఈ వారం నామినేషన్స్ టాస్క్ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే అందరినీ అలరించిన ఆయన.. నామినేట్ అయిన వారి నుంచి ఒకరిని సేఫ్ చేసే పవర్‌తో వచ్చాడు. దీన్ని ఉపయోగించి ఈ వారానికి గానూ బిందు మాధవిని బాబా భాస్కర్ సేఫ్ చేసినట్లు వెల్లడించాడు.

8వ వారం ఐదుగురు నామినేట్

8వ వారం ఐదుగురు నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎనిమిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. అయితే, బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చి బిందు మాధవిని సేఫ్ చేయడంతో ఈ సారి ఐదుగురు మాత్రమే నామినేట్ అయ్యారు. అందులో అఖిల్ సార్థక్, అజయ్ కుమార్, అషు రెడ్డి, హమీదా అనిల్ రాథోడ్‌లు ఎలిమినేషన్ జోన్‌కు వచ్చారు.

బిందు ఓటింగ్ అంతా అతడికే

బిందు ఓటింగ్ అంతా అతడికే

ఎనిమిదో వారానికి జరుగుతోన్న ఓటింగ్ వినూత్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరెట్ బిందు మాధవి, యాంకర్ శివ ఈ సారి నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఓట్లన్నీ అనిల్ రాథోడ్‌కు పడుతున్నాయట. దీంతో అతడే ఈ వారం టాప్‌లో ఉన్నాడని అంటున్నారు. దీంతో మరో టైటిల్ ఫేవరెట్ అయిన అఖిల్ ఈ సారి కూడా రెండో స్థానానికే పరిమితం అయ్యాడట.

అఖిల్ బ్యాచ్‌కు షాక్ మీద షాక్

అఖిల్ బ్యాచ్‌కు షాక్ మీద షాక్

ఇక, ఈ వారం జరుగుతోన్న ఓటింగ్‌లో హమీదా ఖటూన్ మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది. ఫలితంగా అఖిల్ బ్యాచ్‌కు చెందిన అషు రెడ్డి, అజయ్ నాలుగు, ఐదు స్థానాల్లోనే కొనసాగుతోన్నారని తెలిసింది. అంటే.. ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే, ఇది బిగ్ బాస్ షో కాబట్టి.. చివరి నిమిషంలో ఏదైన జరగొచ్చన్నది తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X