Bigg Boss Non Stop: ఓటింగ్ తారుమారు.. బిందు మాధవికి కోలుకోలేని షాక్.. టాప్‌లో అతడు చివర్లో ఆమె!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చి.. అసలు ఎవరూ అనుకోని విధంగా సక్సెస్ అయిన షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కంటెంట్.. షాక్‌కు గురి చేసే సన్నివేశాలు.. కంటెస్టెంట్ల మధ్య చిత్ర విచిత్రమైన ఎమోషన్స్.. అప్పుడప్పుడూ ట్విస్టులు ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోందీ షో. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఇందులో పదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఈ వారం ఎవరు టాప్‌లో ఉన్నారు? డేంజర్‌ జోన్‌లో ఎవరున్నారు? మొత్తంగా ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? అనేవి తెలుసుకుందాం పదండి!

ఆ సీజన్ల కంటే మంచి రెస్పాన్స్

ఆ సీజన్ల కంటే మంచి రెస్పాన్స్

బిగ్ బాస్ షో అంటే తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని జనరంజకంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డుగా చూపిస్తున్నారు. అలాగే, ఆసక్తికరమైన టాస్కులు ఇస్తున్నారు. దీంతో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

9 వారాల్లో.. 9 మంది ఎలిమినేట్

9 వారాల్లో.. 9 మంది ఎలిమినేట్


ఓటీటీ వెర్షణ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్, హమీదాలు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఈసారి అలాంటి ఎలిమినేషన్స్

ఈసారి అలాంటి ఎలిమినేషన్స్

బిగ్ బాస్ మొత్తం ఎలిమినేషన్ ప్రాసెస్ మీదే జరుగుతుంది. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇది ఊహించని విధంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో అంచనాలతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా షో ఆద్యంతం రసవత్తరంగా మారుతోంది.

10వ వారం ఏడుగురు నామినేట్

10వ వారం ఏడుగురు నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో పదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మరీ ముఖ్యంగా బిందు - మిత్రా, అఖిల్ - శివ, అఖిల్ - ఆరియానా ఇలా కొందరి మధ్య వాగ్వాదాలు కనిపించాయి. చివరకు ఇందులో బిందు మాధవి, శివ, అఖిల్, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, ఆరియానా, అషు రెడ్డిలు నామినేట్ అయ్యారు.

ఓటింగ్ తారుమారు.. టాప్‌లోనే

ఓటింగ్ తారుమారు.. టాప్‌లోనే

పదో వారంలో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ గతంలో కంటే రసవత్తరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక, నామినేషన్స్‌లో శృతి మించి ఓవర్ చేసిన బిందు మాధవికి కోలుకోలేని షాక్ తగిలిందట. దీంతో ఆమె రెండో స్థానానికే పరిమితం అయిందని తెలిసింది. ఇక, మరో ఫేవరెట్ అఖిల్ సార్థక్ మాత్రం టాప్‌లో కొనసాగుతున్నాడట.

మిగిలిన వాళ్లు ఓటింగ్ ఇలాగే

మిగిలిన వాళ్లు ఓటింగ్ ఇలాగే


ఈ వారం జరుగుతోన్న ఓటింగ్‌లో అఖిల్, బిందు తర్వాత యాంకర్ శివకు అత్యధిక ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు మూడో స్థానంలో ఉన్నాడని తెలిసింది. ఇక, మిత్రా శర్మ నాలుగో స్థానంలోనూ, ఆరియానా గ్లోరీ ఐదో స్థానంలోనూ కొనసాగుతున్నారని తెలిసింది. అయితే, ఈ వారాంతానికి ఈ పొజిషన్స్‌లో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.

డేంజర్ జోన్‌లో ఎవరున్నారు?

డేంజర్ జోన్‌లో ఎవరున్నారు?

10వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్లు అషు రెడ్డి, అనిల్ రాథోడ్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలిసింది. వీళ్లిద్దరికే చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌లో అనిల్ ఆరో స్థానంలో, అషు ఏడో స్థానంలో ఉన్నారట. అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X