Bigg Boss Non Stop: ఒక్కరోజే మారిన ఓటింగ్.. మళ్లీ టాప్‌కు టైటిల్ ఫేవరెట్.. ఈసారి ఎలిమినేట్ ఎవరంటే!

భారతదేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ఎవరూ ఊహించని రీతిలో స్పందనను దక్కించుకుని దేశంలోనే మరే షోకూ రాని రేటింగ్‌ను అందుకుంటోంది బిగ్ బాస్. సీజన్లు మారుతున్న కొద్దీ ప్రేక్షకాదరణను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. ఈ జోష్‌తోనే ఇప్పుడు నిర్వహకులు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకొచ్చారు. ఇందులో కూడా జనాలు మెచ్చే కంటెంట్‌ను హైలైట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్స్‌తో షాకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో వారం జరుగుతోన్న ఓటింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి!

బోల్డు కంటెంట్‌తో మరింతగానే

బోల్డు కంటెంట్‌తో మరింతగానే


తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా మంచి స్పందన దక్కుతోంది. అయితే, ఇప్పుడు టీవీలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నా దీనికి ఆదరణ పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులతో పాటు బోల్డు కంటెంట్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ మరింత రంజుగా సాగుతోంది. ఫలితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది.

ఇప్పటి వరకు వాళ్లందరూ ఔట్

ఇప్పటి వరకు వాళ్లందరూ ఔట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొదటి రోజే 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లో అడుగెట్టారు. వీళ్లలో నుంచి గడిచిన 9 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్, హమీదాలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

ఈ వారం ఏడుగురు నామినేట్

ఈ వారం ఏడుగురు నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో పదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మరీ ముఖ్యంగా బిందు - మిత్రా, అఖిల్ - శివ, అఖిల్ - ఆరియానా ఇలా కొందరి మధ్య వాగ్వాదాలు కనిపించాయి. చివరకు ఇందులో బిందు మాధవి, శివ, అఖిల్, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, ఆరియానా, అషు రెడ్డిలు నామినేషన్‌లోకి వచ్చారు.

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

పదో వారానికి సంబంధించి బలమైన కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న బిందు మాధవిపై నెగెటివ్ ప్రచారం కారణంగా మొదటి రెండు రోజులు ఆమెకు ఓటింగ్ తగ్గింది. దీంతో అఖిల్ సార్థక్ టాప్‌లోకి వచ్చాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బిందుకు ఒక్కరోజులోనే ఓటింగ్ పెరిగిందట. దీంతో ఆమె టాప్ ప్లేస్‌లోకి వచ్చిందని తెలిసింది.

మిగిలిన వాళ్లు ఎక్కడున్నారు

మిగిలిన వాళ్లు ఎక్కడున్నారు

పదో వారానికి జరుగుతోన్న ఓటింగ్‌లో బిందు మాధవి మరోసారి మొదటి స్థానానికి చేరుకోవడంతో అఖిల్ రెండో స్థానానికి పడిపోయాడని తెలిసింది. ఇక, ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మూడో స్థానంలో యాంకర్ శివ కొనసాగుతున్నాడు. అలాగే, నాలుగో స్థానంలో మిత్రా శర్మ, ఐదో స్థానంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీలు ఉన్నారని అంటున్నారు.

ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే

ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే


ఎంతో ముఖ్యమైన పదో వారంలో అషు రెడ్డి చాలా తక్కువ ఓట్లతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిందని తెలిసింది. ఆమెతో పాటు అనిల్ రాథోడ్ కూడా ఎలిమినేషన్ ప్రమాదంలోనే ఉన్నాడట. అయితే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో అనిల్ చక్కగా ఆడడంతో అతడికి ఓటింగ్ పెరిగిందని తెలుస్తోంది. అంటే ఈ వారం హైడ్రామా జరగకపోతే అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X