For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. అఖిల్‌కు షాకిచ్చిన బిందు.. డేంజర్ జోన్‌లో ఎవరంటే!

  |

  బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చినా.. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటూ ఆదరణను దక్కించుకుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ షో ఒకటి. ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతూ సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకున్న ఇది.. తెలుగులో మరింత ఎక్కువ విజయాన్నే దక్కించుకుంది. అందుకే దేశంలోనే టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది.

  దీంతో నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా నడుపుతున్నారు. ఇది చివరి దశకు చేరడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్‌పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  ఆఖర్లో మరింత ఆసక్తికరంగానే

  ఆఖర్లో మరింత ఆసక్తికరంగానే

  అందరూ అనుకున్నట్లుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, చిత్ర విచిత్రమైన సన్నివేశాలు, ఊహించని ఎలిమినేషన్లు, బోల్డు సీన్స్ కనిపిస్తున్నాయి. దీంతో దీనికి మరింత ఎక్కువ స్పందన దక్కుతోంది. ఇప్పుడు ఆఖరికి చేరుకోవడంతో మరింత రంజుగా మారి మజాను పంచుతోంది.

  శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!

  వాళ్లంతా బయటకు వెళ్లారుగా

  వాళ్లంతా బయటకు వెళ్లారుగా


  ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డిలు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.

  ఊహించని ఎలిమినేషన్స్‌తో

  ఊహించని ఎలిమినేషన్స్‌తో


  సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ముఖ్యమైనది. దీని ద్వారా షో ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే, ఇప్పుడు నడుస్తోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వెళ్లడంతో షో నడిచే తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

  11వ వారం అందరూ లిస్టులో

  11వ వారం అందరూ లిస్టులో


  నామినేషన్స్ టాస్క్ అంటేనే గొడవలతో సాగుతుంది. ఇక, 11వ వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. ఫినాలేకు ముందు జరిగిన ఈ టాస్కులో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివ, నటరాజ్‌ మాస్టర్‌లను నామినేట్ చేసినట్లు వెల్లడించారు.

  అఖిల్‌కు షాకిచ్చిన బిందు

  అఖిల్‌కు షాకిచ్చిన బిందు


  11 వారంలో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ నామినేట్ అవడంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో టైటిల్ ఫేవరెట్లకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. మొదటి రోజు అఖిల్ సార్థక్ ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో రోజు మాత్రం పరిస్థితి ఒక్కసారిగా మారిందని తెలిసింది. దీంతో అఖిల్‌ను వెనక్కి నెట్టేసిన బిందు మాధవి టాప్ పొజిషన్‌కు చేరుకుందని టాక్.

  Sarkaru Vaari Paata: రిలీజ్ రోజే మహేశ్‌కు బిగ్ షాక్.. ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అని అనుమానం

  వాళ్లంతా ఆయా పొజిషన్‌లో

  వాళ్లంతా ఆయా పొజిషన్‌లో


  తాజా వారానికి గానూ జరుగుతోన్న ఓటింగ్‌లో బిందు, అఖిల్ తర్వాత యాంకర్ శివకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు మూడో స్థానంలో ఉన్నాడని అంటున్నారు. ఇక, మిత్రా శర్మ నాలుగో స్థానంలోనూ, ఆరియానా గ్లోరీ ఐదో స్థానంలోనూ ఉన్నారట. దీంతో మొదటి రోజు ఐదో స్థానంలో ఉన్న నటరాజ్ మాస్టర్ ఆరో స్థానానికి పడిపోయాడనే టాక్ వినిపిస్తోంది.

  Sarkaru Vaari Paata Public Talk In Bangalore మూవీ బాగుంది కానీ ... | Filmibeat Telugu
  ఈసారి డేంజర్ జోన్‌‌లో బాబా

  ఈసారి డేంజర్ జోన్‌‌లో బాబా


  ఈ వారం ఓటింగ్‌లో తాజా సమాచారం ప్రకారం పాపులర్ కంటెస్టెంట్లు అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలిసింది. వీళ్లిద్దరికే చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌లో అనిల్ ఏడో స్థానంలో, బాబా ఎనిమిదో స్థానంలో ఉన్నారట. ఆయనకు ఎవిక్షన్ పాస్ ఉండడంతోనే ఓటింగ్ తగ్గిందని తెలుస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Bindu Madhavi Reach Top Place in 11th Week Voting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion