Bigg Boss Non Stop: ఒక్కరోజులో మారిన ఓటింగ్.. అతడు టాప్ ప్లేస్‌కు.. ఎలిమినేషన్ ప్రమాదంలో బ్యూటీ

ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మది దోచుకుని సక్సెస్ అయిన షో బిగ్ బాస్. సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిత్ర విచిత్రమైన సంఘటనలతో సాగిపోయే ఇది మొదటి సీజన్ నుంచే సత్తా చాటుతోంది. ఫలితంగా ఐదింటిని ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను నడుపుతున్నారు. దీనికి కూడా అదే రీతిలో స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతుండడంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో 8వ వారం ఓటింగ్ సరళి ఎలా ఉంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూద్దాం పదండి!

ఆ సీజన్లను మించే కంటెంట్‌తో

ఆ సీజన్లను మించే కంటెంట్‌తో

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని మించేలా ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేయడంతో పాటు బోల్డు సీన్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంటూ సాగిపోతోంది.

ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్

ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్


ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు ఎలిమినేట్ అయ్యారు.

8వ వారం ఐదుగురు నామినేట్

8వ వారం ఐదుగురు నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎనిమిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. అయితే, బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చి బిందు మాధవిని సేఫ్ చేయడంతో ఈ సారి ఐదుగురు మాత్రమే నామినేట్ అయ్యారు. అందులో అఖిల్ సార్థక్, అజయ్ కుమార్, అషు రెడ్డి, హమీదా అనిల్ రాథోడ్‌లు నామినేషన్‌లోకి వచ్చేశారు.

ఈ వారంలో ఓటింగ్‌లో ట్విస్టు

ఈ వారంలో ఓటింగ్‌లో ట్విస్టు

ఎనిమిదో వారంలో కేవలం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ గతంలో కంటే విభిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాలోయింగ్ ఉన్న చాలా మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఫ్యాన్‌బేస్ మొత్తం వేరే వాళ్లకు ఓట్లు వేస్తోంది. ఇలా ఎవరికైతే క్లోజ్‌లో ఉంటున్నారో వాళ్ల ఓటింగ్ ఈ సారి ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

ఒక్కరోజులోనే మారిన ఓటింగ్

రెండు రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్కు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు కంటెస్టెంట్లు శృతి మించి మరీ వ్యవహరించారు. ఫలితంగా ఓటింగ్ సరళి మారినట్లు తెలుస్తోంది. ఈ టాస్కులో మంచిగా ఆడిన వాళ్ల ఓటింగ్ పెరగడంతో పాటు చెత్తగా ఆడిన వాళ్ల ఓటింగ్ తగ్గినట్లు తెలిసింది. దీంతో ఈ వారం ఆసక్తికరంగా మారిపోయింది.

మారిపోయిన మొదటి స్థానం

మారిపోయిన మొదటి స్థానం

ఎనిమిదో వారానికి జరుగుతోన్న ఓటింగ్ టైటిల్ ఫేవరెట్ బిందు మాధవి, యాంకర్ శివ ఫ్యాన్స్ ఓట్లన్నీ అనిల్ రాథోడ్‌కు పడుతున్నాయని అన్నారు. దీంతో అతడే ఈ వారం టాప్‌లో ఉన్నాడని టాక్ వచ్చింది. అయితే, ఈ టాస్కులో అదరగొట్టేసిన అఖిల్ సార్థక్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడట. దీంతో అనిల్ రెండో స్థానానికి పడిపోయాడని బిగ్ బాస్ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది.

ఆమెకు డేంజర్.. ఒకరు ఔట్

ఆమెకు డేంజర్.. ఒకరు ఔట్

ఈ వారం జరుగుతోన్న ఓటింగ్‌లో చివర్లో ఉన్న అషు రెడ్డి మూడో స్థానానికి చేరుకుందని తెలుస్తోంది. ఫలితంగా హమీదా ఖటూన్ నాలుగో స్థానానికి పడిపోయిందట. అంటే ఐదో స్థానంలో ఉన్న అజయ్‌తో కలిసి ఆమె డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X