Bigg Boss Non Stop: 9వ షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని కంటెస్టెంట్.. ఆ ఇద్దరు లేడీస్‌లో ఒకరు ఔట్

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి పరిచయమై.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న షో బిగ్ బాస్. అందుకే ఇది ఏకంగా ఐదు సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెట్టించిన స్పందనతో పూర్తి చేసుకున్నాయి. అదే సమయంలో భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని దీన్ని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిపాయి.

ఫలితంగా నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా సరికొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో 9వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఈ సారి ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? అనే విషయాలను చూద్దాం పదండి!

సరికొత్తగా నడుస్తూ మజా ఇస్తూ

సరికొత్తగా నడుస్తూ మజా ఇస్తూ

తెలుగులో ఇప్పటి వరకూ ఐదు సీజన్లను పూర్తయ్యాయి. దీంతో ఎన్నో అంచనాలతో నాన్ స్టాప్ సీజన్ మొదలైంది. ఇప్పుడు వాటిని మించేలా దీన్ని సరికొత్త కంటెంట్‌తో నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేయడంతో పాటు బోల్డు సీన్స్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంటూ మజా పంచుతోంది.

ఇప్పటికే 8 మంది ఎలిమినేట్

ఇప్పటికే 8 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌లు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

ఆ ఎలిమినేషన్స్‌ వల్ల ఆసక్తిగా

ఆ ఎలిమినేషన్స్‌ వల్ల ఆసక్తిగా

సాధారణంగా బిగ్ బాస్ మొత్తంలోనే ఎలిమినేషన్ అనేది ఎంతో ముఖ్యమైనది. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ భావోద్వేగాలతో సాగుతోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇది ఊహించని విధంగా సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఎవరూ అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.

ఈ వారం ఏడుగురు నామినేట్

ఈ వారం ఏడుగురు నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో తొమ్మిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మరీ ముఖ్యంగా బిందు - శివ, నటరాజ్ - శివ, హమీదా - ఆరియానా, అఖిల్ - శివ ఇలా కొందరి మధ్య గొడవలు జరిగాయి. చివరకు ఇందులో నటరాజ్, ఆరియానా, మిత్రా, శివ, హమీదా, అనిల్ రాథోడ్‌, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు.

9వ వారంలో షాకింగ్ ఓటింగ్‌

9వ వారంలో షాకింగ్ ఓటింగ్‌

తొమ్మిదో వారంలో కేవలం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ గతంలో కంటే విభిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక, మొత్తంగా ఈ వారంలో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన మిత్రా శర్మ టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు తెలిసింది. అఖిల్ సార్థక్ ఫ్యాన్స్ సపోర్టు వల్లే ఆమె మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

తొమ్మిదో వారం జరుగుతోన్న ఓటింగ్‌లో మిత్రా శర్మ తర్వాత యాంకర్ శివకు అత్యధిక ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. ఇక, బాబా భాస్కర్ మూడో స్థానంలో, నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానంలో, అనిల్ రాథోడ్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నారని తెలిసింది. అయితే, వారాంతానికి ఈ పొజిషన్స్‌లో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

ఇద్దరు లేడీస్‌కు భారీ దెబ్బ

ఇద్దరు లేడీస్‌కు భారీ దెబ్బ

తాజా వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, హమీదా ఖటూన్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలిసింది. ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌లో ఆరియానా ఆరో స్థానంలో, హమీదా ఏడో స్థానంలో ఉన్నారట. అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయితే, ఇది మారినా ఆశ్చర్యం లేదనొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X