Bigg Boss Non Stop: ఈ వారం బిగ్ ట్విస్ట్.. మరోసారి ఇద్దరు ఔట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షించిన షోనే బిగ్ బాస్. ఫలితంగా అంచనాలు లేకపోయినా భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా విజయవంతంగా నడుపుతున్నారు. అయితే, ఇందులో మాత్రం ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిసింది. మరీ ఈ సారి డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? అన్న విషయాన్ని చూద్దాం పదండి!

గత వాటి కంటే ఎక్కువ రేంజ్
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్ అవుతూనే ఉంటోంది. అందుకే ఐదు సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రేటింగ్‌తో సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న నాన్ స్టాప్ సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇందులో ఎన్నో ట్విస్టులు ఉండడంతో పాటు బోల్డ్ కంటెంట్ చూపించడంతో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

ఇప్పటికే 8 మంది ఎలిమినేట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

అలాంటి ఎలిమినేషన్స్ వల్ల
బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియే అత్యంత ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ భావోద్వేగాలతో సాగుతోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇది ఊహించని విధంగా ఉంటోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా షోలో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు.

9వ వారం వాళ్లంతా నామినేట్
సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ గొడవలతో సాగుతుంటాయి. ఇఖ, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఇవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో తొమ్మిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. చివరకు ఈ వారం నటరాజ్, ఆరియానా, మిత్రా, శివ, హమీదా, అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు.

ఈ సారి డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రారంభం అయ్యే సమయంలోనే ఇందులో ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతాయని నిర్వహకులు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్ సహా ఎన్నో కొత్త పరిణామాలను చూపించారు. ఈ క్రమంలోనే 9వ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది.

కంటెస్టెంట్ల ఓటింగ్ పొజిషన్స్
తొమ్మిదో వారం జరుగుతోన్న ఓటింగ్‌లో మిత్రా శర్మ ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉందని తెలిసింది. ఆమె తర్వాత యాంకర్ శివకు అత్యధిక ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు రెండో స్థానంలో ఉన్నాడట. ఇక, బాబా భాస్కర్ మూడో స్థానంలో, నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారని తెలిసింది. అంటే వీళ్లంతా ఈ వారానికి దాదాపుగా సేఫ్ అయినట్లే అని టాక్.
Recommended Video


ఆ ముగ్గురిలో ఇద్దరు అవుట్
9వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, హమీదా ఖటూన్ డేంజర్ జోన్‌లో ఉన్నారని వారం మొదట్లోనే లీకైంది. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి.. ఐదో స్థానంలో ఉన్న అనిల్ రాథోడ్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా ఈ ముగ్గురిలోనే ఇద్దరు షో నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











