Bigg Boss Non Stop: ఏడో వారం ఊహించని ఓటింగ్.. అఖిల్‌ కంటే ఆమెకే డబుల్ ఓట్స్.. ఈసారి అతడే ఎలిమినేట్!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులందరి దృష్టినీ ఆకర్షించి.. భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. కొత్త కాన్సెప్టే అయినా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ, బోల్డు కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఈ షోను నిర్వహకులు మరింత సక్సెస్ చేశారు.

దీంతో ఇది ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎలిమినేషన్స్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడో వారం ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అనేవి చూద్దాం పదండి!

మరికాస్త వినోదం.. ఫుల్ రెస్పాన్స్

మరికాస్త వినోదం.. ఫుల్ రెస్పాన్స్

తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ అంతకంతకూ పెరుగుతుండడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా ఇంకాస్త ఎక్కువ వినోదాన్ని ఇస్తోంది.

6 వారాల్లో... ఆరుగురు బయటకు

6 వారాల్లో... ఆరుగురు బయటకు

నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఓటింగ్‌ను పెంచేలా నామినేషన్

ఓటింగ్‌ను పెంచేలా నామినేషన్

బిగ్ బాస్ షో మొత్తంలో ఎన్నో రకాల టాస్కులుంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.

ఏడో వారంలో ఎనిమిది మంది

ఏడో వారంలో ఎనిమిది మంది

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఏడో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్‌లు ఎలిమినేషన్ జోన్‌కు వచ్చారు.

అఖిల్ కంటే ఆమెకే డబుల్‌గా

అఖిల్ కంటే ఆమెకే డబుల్‌గా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరంభం నుంచీ ఆమెకు ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందుకు భారీ ఓటింగ్ నమోదు అవుతోంది. మరో ఫేవరెట్ అఖిల్ కంటే ఆమెకే డబుల్ ఓట్లు పోల్ అవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

ఏడో వారానికి జరుగుతోన్న నామినేషన్స్ ప్రక్రియలో మొదటి రెండు రోజులూ నామినేషన్స్‌లో ఉన్న అందరి పొజిషన్స్ ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. యాంకర్ శివ మూడో స్థానంలో కొనసాగుతున్నాడట. అలాగే, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలోనూ, మహేశ్ విట్టా ఐదో స్థానంలోనూ, మిత్రా శర్మ ఆరో స్థానంలోనూ ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ వారం అతడే ఎలిమినేట్

ఈ వారం అతడే ఎలిమినేట్

ఏడో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఆరంభం నుంచే నటరాజ్ మాస్టర్ చివరి స్థానంలో కొనసాగుతున్నడాని తెలుస్తోంది. గతంలో కంటే ఈ వారం ఆయన తీరు రూడ్‌గా ఉండడంతో ఓటింగ్‌లో వెనకబడ్డాడట. అలాగే, ఆయన కంటే ముందు అంటే ఏడో స్థానంలో అనిల్ రాథోడ్ ఉన్నాడని తెలిసింది. దీనిబట్టి ఈ వారం నటరాజే వెళ్లిపోయే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X