Bigg Boss Non Stop: ఈ వారం ఊహించని ఓటింగ్‌.. స్ట్రాంగ్ ప్లేయర్‌కు షాక్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే!

రియాలిటీ ఆధారంగా నడుస్తూ బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ సక్సెస్ అయిన ఏకైక షో బిగ్ బాస్. టెలివిజన్ రంగంలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న ఈ షో.. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొద్ది రోజుల క్రితమే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మొదలెట్టారు.

ఇది కూడా ఆరంభం నుంచే భారీ స్పందనతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఏడో వారం జరిగిన ఓటింగ్‌లో ఎవరు సేఫ్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ సారి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్లే అవకాశం ఉంది? అనే విషయాలు మీరూ చూడండి!

బోల్డ్‌గా నడుస్తూ మజా పంచుతూ

బోల్డ్‌గా నడుస్తూ మజా పంచుతూ

బిగ్ బాస్ షోకు తెలుగులో ఆదరణ అంతకంతకూ పెరుగుతుండడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా మరింత ఎక్కువగా మజాను అందిస్తోంది.

6 వారాల్లో.. ఆరుగురు ఎలిమినేట్

6 వారాల్లో.. ఆరుగురు ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

నామినేషన్స్‌తో సరికొత్త ప్యూహం

నామినేషన్స్‌తో సరికొత్త ప్యూహం

బిగ్ బాస్ షో మొత్తం రియాలిటీ ఆధారంగా నడుస్తోంది. ఇందులో చాలా టాస్కులు ఉంటాయి. కానీ, అందరి వ్యక్తిత్వాలు బయటకు తెచ్చేది మాత్రం నామినేషన్స్ టాస్కే. అందుకే దీనిపై నిర్వహకులు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువ మంది నామినేషన్స్‌లో ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు.

7వ వారంలో 8 మంది నామినేట్

7వ వారంలో 8 మంది నామినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్‌లు ఎలిమినేషన్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు.

 వాళ్లిద్దరికే సగానికి పైగా ఓటింగ్

వాళ్లిద్దరికే సగానికి పైగా ఓటింగ్

ఏడో వారానికి సంబంధించిన జరిగిన ఓటింగ్ ప్రక్రియలో అందరి కంటే ఎక్కువ ఓట్లను టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి సొంతం చేసుకుందట. ఆమెకు దాదాపు 40 శాతం ఓటింగ్ పడిందని తెలిసింది. ఆమె తర్వాత అఖిల్ సార్థక్‌ ఉన్నాడని అంటున్నారు. వీళ్లిద్దరి కలిపే సగం కంటే ఎక్కువ అంటే సుమారు 70 శాతం ఓట్లు పోలయ్యాయని టాక్.

మిగిలిన కంటెస్టెంట్ల స్థానాలివే

మిగిలిన కంటెస్టెంట్ల స్థానాలివే

నాన్ స్టాప్ సీజన్ ఏడో వారానికి జరిగిన ఓటింగ్‌లో మొదటి నుంచీ నామినేషన్స్‌లో ఉన్న అందరి పొజిషన్స్ ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచాడట. అలాగే, బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలోనూ, మిత్రా శర్మ ఐదో స్థానంలోనూ, మహేశ్ విట్టా ఆరో స్థానంలోనూ ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల తెలిసింది.

ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే

ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఏడో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో ఆరంభం నుంచే నటరాజ్ మాస్టర్ చివరి స్థానంలో కొనసాగుతున్నడాని తెలుస్తోంది. ఆయన కంటే ముందు అంటే ఏడో స్థానంలో అనిల్ రాథోడ్ ఉన్నాడని తెలిసింది. వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారని అంటున్నారు. అయితే, ఈ వారం నటరాజ్ మాస్టరే ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X