Bigg Boss Non-Stop finale : లక్కు తోక తొక్కిన అరియాన.. సూట్ కేసు తీసుకొని.. బయటకు!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇక టాప్ 7 కంటెస్టెంట్లు కాస్త నెమ్మదిగా తగ్గుతున్నారు. ముందుగా అనిల్ రాథోడ్, బాబా భాస్కర్, మిత్ర శర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇక తరువాత నలుగురు హౌస్ లో మిగలగా హౌస్ లోపలికి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్, మెహ్రీన్ లు ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో టెంప్ట్ చేసి అరియానాను బయటకు తీసుకువచ్చారు. మరి ఆ వివరాల్లోకి వెళితే

F3 ప్రమోషన్ కోసం
దర్శకుడు అనిల్ రావిపూడి, మెహ్రీన్ పిర్జాదా, సునీల్ తమ రాబోయే చిత్రం F3 ప్రమోషన్ కోసం బిగ్ బాస్ నాన్-స్టాప్‌కు వచ్చారు. ఎఫ్2 అనేది భార్యాభర్తల మధ్య గొడవలను బేస్ చేసుకుని ఉంటే, ఎఫ్ 3 ట్రిపుల్ ఫన్‌గా ఉంటుందని అనిల్ రావిపూడి అన్నారు. సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులకు రిలేటెడ్ గా ఉంటుందని అన్నారు.

F3 ప్రమోషన్ కోసం
ఇక నాగార్జున అనిల్ రావిపూడి, సునీల్‌లను బ్రీఫ్‌కేస్ నిండా డబ్బుతో బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపారు. అనిల్ ఫైనలిస్టులను ఒప్పించి డీల్ సెట్ చేసుకుని అందులో ఉన్న ఒకరిని బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే రేస్ నుండి తప్పించడానికి ప్రయత్నించాడు. అలా ముందుగా లోపలికి వెళ్లి కాసేపు సందడి చేశారు. తరువాత నాగార్జున ఒక్కొక్కరిని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

ట్రోఫీని గెలవడానికి వచ్చా
ముందుగా బిందు మాధవి మాట్లాడితే నేను బిగ్ బాస్ నాన్-స్టాప్‌కి రావడానికి సంకోచించాను; తెలుగు పరిశ్రమలోకి తిరిగి రావాలనే బలమైన కోరికతో ఇక్కడకు వచ్చానని అన్నారు. నాగార్జున మీరు చేయబోయే చిత్రంలో ఆమెకు ఒక పాత్ర ఇవ్వాలని అనిల్ ను అడిగితే ఆయన సరేనని మాట ఇచ్చాడు. నాన్న కోసం ఈసారి ట్రోఫీని గెలవడానికి వచ్చాను అని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు.

ఇబ్బంది పడి
కొత్త ఫ్లాట్ కొనడానికి తగినంత డబ్బు గెలవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అరియానా గ్లోరీ పేర్కొంది. నేను డబ్బు సంపాదించడానికి, ఇమేజ్‌ని మార్చుకోవడానికి వచ్చాను అని యాంకర్ శివ చెప్పుకొచ్చాడు. అలా కాస్త హడావుడి చేసిన తరువాత అనిల్ మరియు సునీల్ చేసిన మనీ ఆఫర్‌ను అరియానా గ్లోరీ అంగీకరించింది. అయితే దానికి ముందు ఆమె కాసేపు హడావుడి చేసింది. తాను సరైన డెసిషన్ తీసుకున్నానా? లేదా? అనే విషయం మీద క్లారిటీ లేక ఆమె ఇబ్బంది పడింది. చివరికి ఆమె బయటకు వచ్చాక కూడా ఈ విషయం మీద సస్పెన్స్ కొనసాగింది.

పది లక్షలు తెలివితో
అయితే చివరికి ఈ షో నుంచి బయటకు రావడం వలన ఆమెకు పది లక్షలు వస్తున్నాయని చెప్పడంతో ఆమె ఇక ఆనందం వ్యక్తం చేసింది. తాను ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా సొమ్ము రాలేదు కానీ తాను ఈ పది లక్షలు తెలివితో గెలుచుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తం మీద గత సీజన్లో సోహైల్ ఎలా అయితే డబ్బుతో వెనుతిరిగాడో అలాగే ఆమె కూడా డబ్బు తో వెనకడుగు వేసింది.


Click it and Unblock the Notifications











