Bigg Boss Non-Stop finale : శివకు నోటి దూల అవార్డు, శ్రీ రాపాక 'స్మగ్లర్ ఆఫ్ ది సీజన్'!

బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే కూడా గ్రాండ్ గా జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారో అనేది సస్పెన్స్ గా లేకుండా సోషల్ మీడియా లీకులు బయటకు వచ్చేశాయి అనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్ బాస్ ఫినాలేలో ఆసక్తికరంగా అవార్డులు అందించారు. ఆ వివరాల్లోకి వెళితే

మేజర్ టీమ్

మేజర్ టీమ్

ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనే విషయం మీద క్లారిటీ వచ్చేడింది. అయినా గ్రాండ్ ఫైనల్స్ లో ఎవరు విన్ అవుతారో అనే క్యూరియాసిటీ లేకపోతేనేం.. మనల్ని ఎంత మంది ఎంటర్టైన్ చేయడానికి వస్తారు, ఏ సెలబ్రిటీ డాన్స్ చేస్తుంది, ఏ మూవీ టీం సినిమాను ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై మెరుస్తారు అనే ఆత్రుత అందరికీ ఏర్పడింది. ఇక ఇప్పటికే గాడ్సే హీరో సత్యదేవ్ వచ్చివెళ్ళగా తరువాత మేజర్ టీమ్ వచ్చింది.

వివాదాస్పద ప్రశ్నలు

వివాదాస్పద ప్రశ్నలు

మేజర్ హీరో అడివి శేష్, హీరోయిన్లు శోభిత, సాయి మంజ్రేకర్ లు హౌస్ లో సందడి చేశారు. అడివి శేష్, శోభిత మరియు సాయి మంజ్రేకర్ దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన తమ మేజర్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సమయంలో ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో శివ తనను ఎలా వివాదాస్పద ప్రశ్నలు అడిగాడో అడివి శేష్ గుర్తు చేసుకున్నాడు, నాగార్జునతో కలిసి శేష్ శివను కాస్త ఏడిపించాడు.

మిస్టర్ కూల్

మిస్టర్ కూల్

తరువాత అందరు హౌస్ మేట్స్ కు అవార్డులు పంపిణీ చేశారు. ముందుగా అషుకు 'ఎకో ఫ్రెండ్లీ' అవార్డు లభించింది 'ఎకో-ఫ్రెండ్లీ' అవార్డుగా చిన్న బకెట్‌ను పొందడంతో అషు కాస్త ఇబ్బంది ఫీల్ అయింది. స్రవంతి చొక్కారపుకి 'అన్నపూర్ణ' అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చినందుకు హోస్ట్ నాగార్జునకు స్రవంతి ధన్యవాదాలు తెలిపారు. సరయుకి 'ఎమోషనల్ స్టార్' అవార్డు లభించింది.

మిస్టర్ కూల్

మిస్టర్ కూల్

హౌస్ 'రొమాంటిక్ స్టార్' అవార్డును అజయ్ కతుర్వార్ అందుకున్నాడు. బాబా భాస్కర్‌కి 'సూపర్ కటౌట్' అవార్డు ఇవ్వగా ఆయన ఆ అవార్డును తన కుటుంబానికి అంకితమిచ్చాడు. అనిల్‌కు 'ఉత్తమ కెప్టెన్' అవార్డు లభించింది, శోభిత బ్యాడ్జిని అనిల్ కు పిన్ చేసింది. ఆర్జే చైతూకి 'కోకనట్ స్టార్' అవార్డు ఇచ్చారు. శ్రీ రాపాకకు 'స్మగ్లర్ ఆఫ్ ది సీజన్' అవార్డు లభించింది. ఇక హమీద 'షుగర్ దొంగ అవార్డు'కు ఎంపికైంది. మహేష్ విట్టాకు 'మిస్టర్ కూల్' అవార్డు లభించింది.

నోటి దూలకు

నోటి దూలకు

తేజస్వి మదివాడకు 'రెండు పిలకలు' అవార్డు లభించింది. ఫైనలిస్ట్ శివకు 'స్క్రాచింగ్ స్టిక్' అది నోటి దూలకు గాను ఇచ్చారు. ఇక రోలర్ కోస్టర్ రైడ్ చేసినందుకు మిత్రాకు హెల్మెట్, బిందుకి 'బెస్ట్ అడ్వకేట్' అవార్డు లభించగా, అఖిల్ 'పీచ్ సోఫా' అవార్డును అందుకున్నాడు. అరియానాకు మిస్టీ కప్ లెగ్ స్లిప్' అవార్డు లభించింది. అలా మొత్తం మీద ఈ అవార్డుల వ్యవహారం ఆసక్తికరంగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X