twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non-Stop finale : రేసు నుంచి శివ ఔట్.. ఆ పదం వాడకు..పదమే సిగ్గు పడుతుందన్న నాగ్!

    |

    ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి అంకానికి చేరింది. శనివారం నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ షో కి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ ప్రసారమవుతోంది.. తొలుత హౌస్ లో ఏడుగురు సభ్యులు టాప్ లో ఉండగా వారిలో ముందుగా అనిల్ రాథోడ్, తర్వాత మిత్రశర్మ, తర్వాత బాబా భాస్కర్, ఆ తర్వాత అరియానా ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో చివరిగా శివ ఎలిమినేట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

    శివ ఎలిమినేట్

    శివ ఎలిమినేట్


    బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఎపిసోడ్ లో అరియానా పది లక్షల సూట్ కేసు తీసుకుని ఫినాలే ఫైట్ నుంచి తప్పుకుంది. మిగిలిన ముగ్గురు శివ, అఖిల్, బిందు మాధవిలలో ఒకరిని ఎలిమినేట్ చేయడం కోసం హోస్ట్ నాగార్జున ప్రాసెస్ మొదలుపెట్టారు. అలా కొత్తగా బాంబ్ బ్లాస్ట్ చేసేలా వైర్లు కట్ చేసే ప్రాసెస్‌లో బిందు, అఖిల్‌లు సేవ్ కాగా.. శివ ఎలిమినేట్ అయ్యారు.

    ఒకరికొకరు శుభాకాంక్షలు

    ఒకరికొకరు శుభాకాంక్షలు


    ఇక బయటకు వచ్చిన తరువాత తన తల్లితండ్రులను స్టేజ్ మీదకు తీసుకువచ్చి ఆనందపడ్డారు శివ. వివాదాస్పద యాంకర్ గా వచ్చిన నేను ఎంటర్టైనర్గా అడుగు బయట పెడుతున్నాను అని శివ చెప్పుకొచ్చాడు. శివకు వీడ్కోలు పలికిన తర్వాత బిందు మరియు అఖిల్ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్టేజ్ మీదకు వచ్చిన తరువాత నేను నా కోపాన్ని, నోటిని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను అని యాంకర్ శివ పేర్కొన్నాడు.

    టికెట్ గురించి

    టికెట్ గురించి


    ఇక సీజన్ 6 డైరెక్ట్ టికెట్ గురించి ఆలోచిస్తానని నాగార్జున హామీ ఇవ్వడంతో బిందు గెలుస్తుందని శివ గెస్ చేశాడు. అయితే ఎంతమందిని ట్రై చేశావని నాగార్జున అడిగితే అందరినీ చేశానని అంటాడు. అంటే తాను జెంయూన్ అని అన్నాడు శివ, దయచేసి ఆ పదం పరువు తీయవద్దని నాగ్ పేర్కొన్నాడు. ఇక ఎక్కడో మారు మూల శ్రీకాకుళంలో పుట్టిపెరిగిన యాంకర్ శివ.. అతి కష్టం మీద తన చదువు కంప్లీట్ చేశాడు. ఆ తరువాత చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో హైదరాబాద్ వచ్చేశాడు.

    అవమానాలు

    అవమానాలు


    యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేయాలని చూసిన శివకి ఎక్కడా అవకాశం దొరకలేదు. నీ ముఖం చూసుకున్నావా? నువ్వు యాంకర్ వా అంటూ అవమానాలు ఎదుర్కొన్నాడు శివ. దీంతో వార్తలు చదివడం కుదరక పోతే కనీసం వార్తలు మోసుకొచ్చే ఛానల్‌లో డ్రైవర్‌గా నైనా చేద్దాం అనుకుని ఓ ప్రముఖ ఛానల్‌లో కార్ డ్రైవర్‌గా చేరాడు. అక్కడ ఉంటూనే వార్తలు ఎలా చదవాలి? వార్తల్ని ఎలా సేకరించాలి.? సేకరించిన వార్తలు ఎలా బయటకు పంపాలి అనే విషయం మీద అవగాహన సంపాదించాడు.

    టాప్ 3 కంటెస్టెంట్ గా

    టాప్ 3 కంటెస్టెంట్ గా


    మధ్యలో ఆర్ధికపరమైన ఇబ్బందులతో జీతం ఎక్కువ వస్తుందని ఆ ఛానల్‌లో మానేసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డ్రైవర్‌గా చేరాడు. అక్కడ పనిచేస్తూనే యూట్యూబ్ ఛానల్స్‌లో యాంకర్‌గా ప్రయత్నాలు చేస్తూ ఉండగా చివరికి 2017లో ఓ యూట్యూబ్ ఛానల్‌లో యాంకర్‌గా జాబ్ సాధించి.. ఆ తర్వాత ఆరేడు ఛానల్స్ మారుతూ చివరికి తానే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. కాంట్రవర్శి యాంకర్ గా పాపులర్ అయి ఆ పాపులారిటీతో బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. చివరికి టాప్ 3 కంటెస్టెంట్ గా బయటకు వచ్చాడు.

    English summary
    in Bigg Boss Non-Stop finale Shiva is out as top 3rd contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X