Bigg Boss Nonstop : ఆ రోజునే ఫినాలే.. గెలిస్తే ఎన్ని లక్షలు ఇస్తారంటే?

ఎట్టకేలకు బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి అంకానికి చేరింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫైనల్ ఫైట్ ఉత్కంఠగా మారింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో 12 వారాలుగా సాగుతున్న ఈ ఆట చివరి ఇప్పుడు అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ ఫినాలే ఎప్పుడు జరగనుంది? గెలిచిన వారికి ఏమి ఇవ్వనున్నారు?అనే వివరాల్లోకి వెళితే ..

ఏడుగురు టైటిల్ కోసం

ఏడుగురు టైటిల్ కోసం


బిగ్ బాస్ నాన్ స్టాప్ షో గత పన్నెండు వారాలుగా సాగుతోంది. ఈ వారంతో నాన్ స్టాప్ షో కి తెర పడనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మిత్రశర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి మొత్తం ఏడుగురు టైటిల్ కోసం పోటీపడుతున్నారు.

ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓట్లు

ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓట్లు


సాధారణంగా అయితే ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే చివరి వారంలో ఉండేవారు. ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నా కానీ అది జరుగుతుందని అనుకున్నా, అలా జరగడం లేదు. బుధవారం రాత్రి వరకు మాత్రమే ఓటింగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి, హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓట్లు పడుతున్నాయి గనుక వీరంతా ఫైనలిస్ట్ లనే లెక్క వేయాలి.

టాప్ కంటెస్టెంట్లుగా

టాప్ కంటెస్టెంట్లుగా


ఇక తాజా సమాచారం మేరకు ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను శనివారం నాడు చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. తాజా సమాచారం మేరకు గ్రాండ్ ఫినాలే, మే 21 న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇక బిందుమాధవి, అఖిల్ సార్థక్ టాప్ కంటెస్టెంట్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. కాబట్టి వీరిద్దరూ బిగ్ బాస్ నాన్ స్టాప్ ట్రోఫీ రేసులో ఉండేందుకు బలమైన కంటెస్టెంట్లు అని అంటున్నారు.

 మే 21 సాయంత్రం

మే 21 సాయంత్రం


సోషల్ మీడియాలో ప్రచారం దాని మేరకు ఈ ఫైనల్‌కు ప్రత్యేక అతిథులు ఎవరూ ఉండకపోవచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మాదిరిగానే, హోస్ట్ నాగార్జున విజేతకు ట్రోఫీని అందజేయనున్నారు. బిగ్ బాస్ నాన్‌స్టాప్ విజేత నగదు బహుమతి గురించి చెప్పాలంటే, ఈ సీజన్ విజేత విజేత బిగ్ బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు దాదాపు రూ. 25 లక్షల నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లవచ్చని బజ్ ఉంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మే 21న సాయంత్రం 6 గంటలకు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

 అందరికంటే తక్కువ ఓట్లు

అందరికంటే తక్కువ ఓట్లు


ఇక ఉన్నవారందరిలో అందరికంటే తక్కువ ఓట్లు అనిల్ రాథోడ్ కి పోల్ అయ్యాయి. ఆ తర్వాత మిత్రశర్మ లీస్ట్ లో ఉంది. టాప్ 5 విషయానికొస్తే.. బాబా భాస్కర్ ఐదో స్థానంలో.. అరియానా గ్లోరీ నాలుగో స్థానంలో ఉంది. యాంకర్ శివ మూడో స్థానాల్లో ఉన్నారు. టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X