Bigg Boss Non stop : మరో లేడీ కంటెస్టెంట్ ఔట్.. స్ట్రాంగ్ అనుకుంటుండగానే షాక్?
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట మొదలైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్‌గా ప్రసారం అవుతున్న ఈ షో మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఆ తర్వాత షో మీద జనాల్లో ఆసక్తి రేగింది. ఎప్పటిలాగే ఆదివారం నాడు ఎలిమినేట్ అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఎపిసోడ్ శనివారం షూట్ అవుతుంది. ఈ క్రమంలో ఆ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు? అనే విషయం ముందే తెలిసిపోతుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? అనే విషయాన్ని చూద్దాం పదండి!

18 మంది
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ 18 మంది లో కొత్త వాళ్లతో పాటు పాత సీజన్లలో అలరించిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చొక్కారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఎన్నో గొడవలతో
బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. సాధారణంగా బిగ్ బాస్ షో లో నామినేషన్ విషయంలో గొడవలు సర్వ సాధారణమే అయినా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఈ నామినేషన్ గొడవలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో తొమ్మిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగే ఎన్నో గొడవలతో సాగింది.

మంచి వోటింగ్
ఇక చివరకు ఈ వారం నటరాజ్, ఆరియానా, మిత్రా, శివ, హమీదా, అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. ఇక తొమ్మిదో వారం జరిగిన ఓటింగ్‌లో మిత్రా శర్మ ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉందని టాక్ బయటకి వచ్చింది. ఆమె పేరుతో ఆమె టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ సహా ఆమె టీమ్ ఆమె పేరిట చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆమెకు మంచి వోటింగ్ తెచ్చిపెడుతోంది.

డేంజర్ జోన్‌లో
ఆమె తర్వాత యాంకర్ శివకు అత్యధిక ఓట్లు పోల్ అవుతున్నాయని అంటున్నారు, ఈ క్రమంలో శివ రెండో స్థానంలో ఉన్నాడట. ఆ తర్వాత బాబా భాస్కర్ మూడో స్థానంలో, నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వీళ్లంతా ఈ వారానికి దాదాపు సేఫ్ అయినట్లే. 9వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్లుగా పేరున్న ఆరియానా గ్లోరీ, హమీదా ఖాతూన్, అనిల్ రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.

హమీదా ఖాతూన్ ఔట్
ఈ వారం అనిల్ రాథోడ్ , హమీదాలకు లీస్ట్ ఓటింగ్ పడిందని తెలుస్తోంది. ఇక వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ ఒరాసేస్ జరగగా ఈ పోటీలో హమీదా వెనుక పడటంతో అనిల్ సేవ్ అయినట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 5లో ఐదవ వారంలో ఎలిమినేట్ అయిన హమీదా.. నాన్ స్టాప్‌లో మాత్రం 9 వ వారం వరకూ నెట్టుకొచ్చింది. ఆదివారం ఈ ఎపిసోడ్ అధికారికంగా టెలీకాస్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











