Bigg Boss Non Stop: నీ ముక్కు కొస్తారు, ఇది పక్కా.. బిందుమాధవిపై షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్న కొద్దీ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు మరింత ముదురుతున్నాయి. బిగ్ బాస్ కూడా గోడవలను క్రియేట్ చేయడంలో చాలా తెలివిగా టాపిక్స్ వెతుకుతున్నారు అనిపిస్తోంది. ఇక అందరూ ఎక్కువగా బిందుమాధవిని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. నటరాజ్ మాస్టర్ అలాగే అఖిల్ ఇద్దరు బిందుమాధవిని ఏ విషయంలో విడిచి పెట్టడం లేదు. ఇక టాప్ 5కి అర్హత లేని కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ మరో గోడవకు దారి క్రియేట్ చేశాడు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాప్ 5కి అర్హత లేని కంటెస్టెంట్స్..

టాప్ 5కి అర్హత లేని కంటెస్టెంట్స్..


ఇక టాప్ 5కి అర్హత లేని కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో నటరాజ్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయారు. నెగిటివీటి కంప్లీట్ గా ఉన్న ఏకైక పర్సన్ నువ్వు మాత్రమే అంటూ నటరాజ్ మాస్టర్ బిందుమాధవిపై కౌంటర్ వేశాడు. మరి నీ వైపు ఇన్ని రోజులు ఏమి వచ్చింది. పాజిటివీటినా అని బిందు మరో కౌంటర్ ఇచ్చింది.

అది ఎంతవరకు న్యాయం

అది ఎంతవరకు న్యాయం


ఇక అఖిల్ సార్ధక్ తన బలాన్ని నిరూపించుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నా పేరెంట్స్.. ఎంత పగవాడు ఉన్నా ప్రేమించడం అనేది నేర్పించారు అని అన్నాడు. ఇక నటరాజ్ మాస్టర్ బాబా మాస్టర్ పై ఊహించని కామెంట్స్ చేశాడు. రన్నింగ్ రేస్ లో అందరూ కష్టపడి పరిగెత్తుతూ ఉంటే 90 మీటర్స్ వచ్చాక ఒకతను జాయిన్ అయ్యాడు. అది ఎంతవరకు న్యాయం అని నాటరాజ్ మాస్టర్ లాజిక్ చెప్పడంతో బాబా మాస్టర్ గట్టిగా నవ్వేశారు.

 మోసం చేస్తే..

మోసం చేస్తే..

ఇక బాబా మాస్టర్ నవ్వులకు నటరాజ్ మాస్టర్ కు కోపం గట్టిగానే వచ్చినట్లుంది. ఇక బాబా మాస్టర్ కు లాజిక్ మాట్లాడుతూ నేను టాప్ 5లో ఉండకూడదు అంతే కదా అని అన్నాడు. ఇక మోసం చేస్తే పెద్ద కంటెస్టెంట్స్ అయిపోతారా? అని బిందుమాధవి ప్రశ్నించగా.. ఇన్ని రోజులు ఏడ్చిన వాళ్ళు వెళ్లిపోయారు నేను ఒక్కడినే మిగిలా అని మరో కౌంటర్ ఇచ్చాడు.

 నేను స్ట్రాంగెస్ట్ పర్సన్

నేను స్ట్రాంగెస్ట్ పర్సన్

ఇక అఖిల్ ఎమోషనల్ గా హైలెట్ అవ్వాలని చూస్తున్నాడు అని యాంకర్ శివ మొహం మీదే చెప్పేశాడు. ఇక అఖిల్ నేను సోలోగానే ఫైట్ చేస్తాను అంటూ సిగ్నిచర్ చూపించారు. ఇక బిందుమాధవి, నటరాజ్ మాస్టర్ మధ్యలో గొడవలు మరో రేంజ్ కు వెళుతున్నాయి. ఈ హౌస్ లో నీ బెస్ట్ ఏంటి చెప్పు అని నటరాజ్ మాస్టర్ అడగ్గానే.. నేను స్ట్రాంగెస్ట్ పర్సన్ అని బిందుమాధవి ధీటుగా సమాధానం ఇచ్చింది.

నీ ముక్కు కొస్తారు..

ఇక ఇప్పటివరకు చేసినవన్ని కూడా దొంగ నామినేషన్లు అంటూ నటరాజ్ కెమెర్ వైపు చూసాడు. అలా కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు అనగానే నీ ఫేస్ చూడలేక కల్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో నరాలు ఎక్కడ పగిలిపోతాయో అని భయం వేసి కెమెరా వైపు చూసినట్లు నటరాజ్ సెటైర్ వేశారు. ఇక బిందుమాధవి మహంకాళి స్టిల్ ఇవ్వగా.. నటరాజ్ మాస్టర్ శూర్పణఖ అంటూ. నీ టైమ్ ఆసన్నమైంది.. ఇది లక్ష్మణ బాణం... ఆడియెన్స్ నీ ముక్కు కొస్తారు. ఇది పక్కా అంటూ నటరాజ్ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X