Bigg Boss Non Stop : పరిస్థితి తారుమారు.. ఈ వారం కూడా ఊహించని కంటెస్టెంట్ ఔట్!
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో నిర్వాహకులు హిందీలో హిట్ అయిన ఓటీటీ ఫార్మాట్ ను బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో మొదటి సీజన్‌ను మొదలెట్టారు. ఈ ఓటీటీ సీజన్ కూడా ముందు నుంచి భారీ స్పందనతో సత్తా చాటుతోంది. ఇక ఏడో వారం చివరికి చేరడంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? అనే విషయం సోషల్ మీడియాలో లీకయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే వివరాల్లోకి వెళితే

ఐదుగురు ఔట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఈసారి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, ఐదో వారం తేజస్వీలు, ఆరో వారం ముమైత్ ఖాన్ (రెండోసారి) స్రవంతి చొక్కారపులు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

ఎనిమిది మంది నామినేట్
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ప్రతి సారి లాగానే అనేక గొడవలతో సాగింది. ఇద్దరిద్దరు చొప్పున గొడవపడి నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ క్రమంలో ఈ వారం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు.

టాప్ లో బిందు మాధవి
అలా మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్‌లు ఎలిమినేషన్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఏడో వారానికి సంబంధించిన జరిగిన ఓటింగ్ ప్రక్రియలో అందరి కంటే ఎక్కువ ఓట్లను టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది.

నటరాజ్ మాస్టర్ అనుకున్నా
ఆమె తరువాత స్థానంలో అఖిల్ సార్థక్ ఉన్నాడని అంటున్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో యాంకర్ శివ, అరియానా గ్లోరీ, మిత్రా శర్మ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, అనిల్ రాథోడ్ ఉన్నారని అంచనాలు వెలువడ్డాయి. నటరాజ్ మాస్టర్, అనిల్ రాథోడ్ డేంజర్ జోన్‌లోనే ఉన్నారని అలా ఈ వారం నటరాజ్ మాస్టర్ లేదా అనిల్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని అంచనాలు వెలువడ్డాయి కానీ చివరికి అలా అయితే జరగలేదు.

మహేష్ విట్టా అవుట్
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఓటింగ్ ప్రకారం చూస్తే నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ కావాల్సిందే. కానీ బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకులు వేసే ఓటింగ్ కాదు కంటెస్టెంట్ ల ఫేట్ డిసైడ్ చేసేసి, వాళ్ళు ఇచ్చే కంటెంట్. వచ్చే వారంలో ఫ్యామిలీ రౌండ్ ఉంటుంది కాబట్టి నటరాజ్ మాస్టర్ మరో వారం ఉంటారని, ఈ వారం మహేష్ విట్టాను అవుట్ చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











