Bigg Boss Non Stop: షోలో ఊహించని సీన్.. తనను తాను కొట్టుకున్న లేడీ.. వాళ్లు అడ్డుకోకుంటే!
చిత్ర విచిత్రమైన సంఘటనలు.. ఊహించని పరిణామాలు.. కంటెస్టెంట్ల మధ్య రకరకాల ఎమోషన్స్‌తో సాగుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే అన్నింటి కంటే ఎక్కువ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా ఆసక్తికరమైన కంటెంట్‌తో రంజుగా నడుపుతున్నారు. దీంతో ఇది కూడా ఆరంభం నుంచే సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో నిర్వహకులు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర విచిత్రమైన టాస్కులను తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే చివరి నామినేషన్స్ కోసం మరో ప్రయోగం చేశారు. ఇందులో హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి హౌస్‌లో కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో భాగమయ్యారు.

టాప్ 5లో ఉండడానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనేది చెప్పాలంటూ ఇచ్చిన టాస్కులో ఎన్నో రకాల గొడవలు జరిగాయి. మరీ ముఖ్యంగా బిందు మాధవి.. అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలను నామినేట్ చేయగా.. వాళ్లంతా ఆమె క్యారెక్టర్‌పై పర్సనల్ ఎటాక్ చేశారు. అలాగే, ఆరియానా - మిత్రా మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. నటరాజ్ మాస్టర్, బాబా భాస్కర్ మధ్య కూడా వార్ జరిగింది. అలాగే, అనిల్ రాథోడ్ కూడా బాబా భాస్కర్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే మిత్రా శర్మ.. యాంకర్ శివ మధ్య జరిగిన గొడవ శృతి మించి పోయింది. దీంతో ఒక దశలో మిత్రా శర్మ సహనం కూడా కోల్పోయింది.
యాంకర్ శివ వంతు వచ్చిన సమయంలో మిత్రాను నామినేట్ చేసి.. 'ఆమె అబద్ధాలు చెబుతుంది. లవ్ బ్యాడ్జ్ పోయినప్పుడు అందరినీ అడిగి.. ఆరియానా గ్లోరీని మాత్రం అడగలేదు. ఎందుకంటే ఆమెకు నిజం తెలుసు కాబట్టి' అని అన్నాడు. దీంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చేసింది. 'నేను ఆమె దగ్గర ఎందుకు వెతకలేదో మీకు తెలుసా' అంటూ ఊగిపోయింది. అంతేకాదు, అక్కడ ఏర్పాటు చేసిన సెట్‌కేసి చేతులను కొట్టుకుంది. ఆ తర్వాత తలను కూడా కొట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న నటరాజ్ మాస్టర్ ఆమెను పట్టుకుని ఆపేశాడు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇక, దీనిపై నాగార్జున సీరియస్ అయ్యే అవకాశం ఉంది.
అనంతరం ఆ గొడవలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. 'ఆమె లవ్ బ్యాడ్జ్ గురించి ఆమె అందరినీ అడగలేదు. నన్ను అడగలేదు' అని చెప్పాడు. అయితే, అప్పుడు ఆరియానా వచ్చి 'అడిగిందో లేదో మాకు తెలీదు. కానీ, నాతో అందరినీ అడిగాను. నీతో బాండింగ్ వల్ల అడగలేదు అని చెప్పింది' అంటూ మిత్రా గురించి నిజం చెప్పింది. దీంతో యాంకర్ శివ తనకు కూడా ఇలాగే చెప్పిందంటూ మళ్లీ ఆమెను బుక్ చేశాడు. దీంతో మిత్రా సైలెంట్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











