For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిందు, నటరాజ్ ఇష్యూపై నాగార్జున సీరియస్.. ఆమెను బయటకు పంపేస్తానంటూ!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో జోనర్లకు సంబంధించిన రకరకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన షో బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో ప్రసారమయ్యే షోనే అయినా దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇలా ఇప్పటికే నిర్వహకులు ఐదు సీజన్లను కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

  అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!

  రెగ్యూలర్ బిగ్ బాస్ సూపర్ హిట్ అవడంతో.. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇది కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను చూపించడంతో పాటు బోల్డు సీన్స్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఇందులో పాత సీజన్లను మించిన వినోదం అందుతోంది. ఇక, ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. అంతేకాదు, ఇందులో గతంలో పాత సీజన్లలో ఎప్పుడూ చూడని విధంగా ఎక్కువగా ఫైటింగ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సీజన్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

  Bigg Boss Non Stop: Nagarjuna Fire on Nataraj, Bindu and Mitraaw Sharma

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో గత సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియపై అందరూ ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఇక, ఈ టాస్కులో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మతో గొడ పెట్టుకుంది. అలాగే, యాంకర్ శివ - మిత్రా మధ్యన కూడా ఫైట్ జరిగింది. దీంతో ఇది మరితం రంజుగా సాగింది.

  F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  బిగ్ బాస్ షోలో హోస్ట్ అక్కినేని నాగార్జున వారానికి రెండు రోజుల పాటు సందడి చేసేవాడు. నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఆదివారం మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం రాత్రి జరగబోయే ఎపిసోడ్‌లో ఆయన ఆరంభం నుంచే గత వారం జరిగిన కొన్ని గొడవలను హైలైట్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో దీన్ని చూపించారు. ముందుగా నాగార్జున.. ఆరియానా ఆరోగ్యం బాగోకపోయినా ఆమె చక్కగా ఆడుతున్నందుకు ప్రశంసించాడు. ఆ తర్వాత ఆమె స్టూపిడ్‌గా ఉంటున్నావని క్లాస్ పీకాడు. అలా నాగ్ ఫైర్ అవడంతో ఆరియానా కన్నీరు పెట్టుకున్నట్లు ప్రోమోలో చూపించారు.

  ఇక, గత వారంలో తన బిహేవియర్‌తో విమర్శలను ఎదుర్కొన్న నటరాజ్ మాస్టర్‌పై నాగార్జున ఓ రేంజ్‌లో విరుచుకు పడ్డాడు. 'నువ్వు నీ కూతురి కోసం ఆడుతున్నావు. ఆమె పెద్దయ్యాక నువ్వు చేసింది చూస్తే ఎంత చెండాలంగా ఉంటుందో తెలుసా?'.. 'బిందు వాళ్ల నాన్న ఫెయిల్ అయ్యారని నువ్వెలా డిసైడ్ చేస్తావు' అంటూ ప్రశ్నలతో ఫైర్ అయ్యాడు. అలాగే, చెన్నై తెలుగు కామెంట్ల పైనా సీరియస్ అయ్యాడు. దీంతో నటరాజ్ మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పాడు. అలాగే, బిందు మాధవి.. నటరాజ్‌ను తిట్టింది.. మిత్రా శర్మ చేతిని కొట్టుకున్నది చూపించి వాళ్లకు కూడా క్లాస్ పీకాడు. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

  English summary
  Bigg Boss Non Stop Season Running Successfully. Nagarjuna Fire on Nataraj, Bindu and Mitraaw Sharma In An Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X