Bigg Boss Non Stop: బిందు మాధవికి నాగార్జున షాక్.. ‘బాత్రూం.. పక్కకు రా’ అన్న వీడియోలు చూపించి!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. తెలుగులోకీ పరిచయమైన రియాలిటీ షోనే బిగ్ బాస్. కొందరు కంటెస్టెంట్లను ఒక ఇంట్లో ఉంచి.. వాళ్లతో చిత్ర విచిత్రమైన టాస్కులు ఆడించి.. ప్రేక్షకుల మద్దతు అందుకున్న వారిని విజేతగా ప్రకటించడమే ఈ షో నేపథ్యం. తెలుగులో ఆలస్యంగా మొదలైనా.. అనూహ్యంగా ఆరంభంలోనే దీనికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్‌ను అందుకుని షో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే ఓటీటీ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఆదివారం వచ్చే ఎపిసోడ్‌లో నాగార్జున.. బిందు మాధవిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు పలు వీడియోలతో చుక్కలు చూపించాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

వాటిని మించేలా దూసుకుపోతూ
బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు సీజన్లను ఒక దానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో విజయం సాధించాయి. ఇప్పుడు వాటిని మించేలా ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేయడంతో పాటు బోల్డు సీన్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఇది దీనికి వాటి కంటే మరింత ఎక్కువ స్పందనే దక్కుతుంది.

ఏడు వారాలకు ఏడుగురు అవుట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు ఎలిమినేట్ అయిపోయారు.

8వ వారం ఐదుగురు నామినేషన్
ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎనిమిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. అయితే, బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చి బిందు మాధవిని సేఫ్ చేయడంతో ఈ సారి ఐదుగురు మాత్రమే అంటే అఖిల్ సార్థక్, అజయ్ కుమార్, అషు రెడ్డి, హమీదా అనిల్ రాథోడ్‌లు నామినేషన్ జోన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ వారం ఆ టాస్క్.. అఖిల్ సత్తా
8వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునేందుకు 'హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో హ్యూమన్స్ టీమ్ గెలిచింది. దీంతో వాళ్లంతా కెప్టెన్సీ టాస్కుకు పోటీ పడగా.. అందులో అఖిల్ సార్థక్ మరోసారి కెప్టెన్ అయ్యాడు.

పంచాయతీలు పెట్టిన నాగార్జున
మామూలుగా బిగ్ బాస్ షోలో వారానికి రెండు రోజుల పాటు సందడి చేసే అక్కినేని నాగార్జున.. నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఆదివారం మాత్రమే కనిపిస్తాడని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో నాగ్ ఆరంభం నుంచే పంచాయతీలు పెట్టాడు. ఇందులో కొన్ని వీడియోలు చూపించి క్లాస్ పీకాడు.
బిందు మాధవిని టార్గెట్ చేస్తూ
తాజాగా విడుదలైన ప్రోమోలో అక్కినేని నాగార్జున.. టైటిల్ ఫేవరెట్ బిందు మాధవిని టార్గెట్ చేసినట్లు చూపించారు. ముందుగా ఆమెను, శివను కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన ఆయన.. అఖిల్‌తో బాత్రూం అంటూ జరిగిన సంభాషణ గురించి అడిగాడు. ఆ తర్వాత అఖిల్‌ను కూడా పిలిచి పంచాయతీ పెట్టాడు. ఇది తేలకపోవడంతో వీడియోను కూడా చూపించి బిందుకు షాకిచ్చాడు.

పక్కకు రా... బ్యాక్ బోన్ అంటూ
అఖిల్ తనను పక్కకు రా అన్నాడని బిందూ చేసిన ఆరోపణల గురించి కూడా నాగార్జున పంచాయతీ పెట్టాడు. అందులో ఆ వీడియోను చూపించగా.. మొదట ఆమె అలా అన్నట్లు అర్థం అయింది. అలాగే, అజయ్‌తో జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించాడు. ఇందులోనూ బిందూనే తప్పుగా మాట్లాడినట్లు తేలింది. మొత్తంగా ఈరోజు మొత్తం ఆమెను టార్గెట్ చేసినట్లు ఉంది.


Click it and Unblock the Notifications











