Bigg Boss Non Stop: బిందుపై బూతు మాటలు.. అతడిపై నాగార్జున సీరియస్.. రూమ్‌లోకి పిలిచి మరీ వార్నింగ్
బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నేళ్ల క్రితం పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మంచి ఆదరణ దక్కింది. అందుకే ఐదు సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా అదే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌పై హోస్ట్ అక్కినేని నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అంతేకాదు, కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అన్నింటి కంటే ఎక్కువ బోల్డుగా
ఆరంభానికి ముందు నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్.. అనుకున్నట్లుగానే ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని విధంగా బోల్డు కంటెంట్ ప్రసారం అవుతోంది. ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు ఇందులో కనిపించడంతో సీజన్ అంతకంతకూ రంజుగా మారుతోంది.

బిందు వర్సెస్ అఖిల్ అనేలాగ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో బిందు మాధవి.. అఖిల్ సార్థక్ కూడా టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి మధ్యనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. అందుకే వీళ్లే తరచూ గొడవలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ అంటే నటరాజ్, అషు, అజయ్‌లు బిందును టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎన్నో ఫైటింగులు కూడా జరిగాయి.

బిందు, శివపై బూతు మాటలతో
ఇటీవలే జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్, అజయ్, అషు, నటరాజ్ మాస్టర్ మధ్య బిందు, శివ గురించి చర్చ జరిగింది. ఇందులో అఖిల్.. బిందు, శివ గురించి చెప్పండి అనగానే అజయ్ 'దుప్పట్లో దడదడ' అన్నాడు. అప్పుడు అషు 'ముసుగులో గుద్దులాట' అంది. తర్వాత అజయ్ 'గోడకేసి గుద్దుడే' అన్నాడు. నటరాజ్ అయితే ఏవేవో బూతులు మాట్లాడగా అవి మ్యూట్ చేశారు.

ఆదివారం ఎపిసోడ్‌లో నాగ్ ఫైర్
బిగ్ బాస్ షోలో ఆదివారం జరిగే ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా సాగుతుంది. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నా.. దాన్ని మరిపించేందుకు హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో ఆటలు ఆడిస్తాడు. అందుకు అనుగుణంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా ఇంటి సభ్యులపై నాగార్జున ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత అందరితో సందడిగా గడిపి ప్రేక్షకులను బాగానే అలరించాడు.

అతడిని రూమ్‌లోకి పిలిచాడు
ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అందరూ చెత్తగా ఆడారని చెప్పిన నాగార్జున.. వాళ్లు చేసిన పొరపాట్ల గురించి నిర్మొహమాటంగా వివరించాడు. అంతేకాదు, అందరికీ క్లాస్ పీకిన తర్వాత అఖిల్ బ్యాచ్‌లో ఉంటూ తన ఆటను ఇంకా బయట పెట్టలేకపోతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అజయ్‌ను కన్‌ఫెషన్ రూమ్‌లోకి రమ్మని చెప్పాడు. దీంతో భయంభయంగానే అతడు లోపలికి వెళ్లాడు.

వీడియో చూపించి వార్నింగ్
అజయ్‌ను లోపలికి పిలిచిన తర్వాత 'మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. అందులోనూ కొన్ని పదాలు అస్సలు వాడకూడదు. అది వాళ్లకు తెలిస్తే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా' అంటూ క్లాస్ పీకాడు. ఆ తర్వాత బిందు మాధవి, శివ గురించి అజయ్ మాట్లాడిన 'దుప్పట్లో దడ దడ' వీడియోను నేరుగా అతడికే చూపించాడు.

క్షమాపణ చెప్పడంతో వదిలేసి
ఆ వీడియో చూపించిన తర్వాత అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడు నాగార్జున 'ఇది బయటకు ఏ రకంగా వెళ్లిందో తెలుసా? మళ్లీ ఇలాంటి కామెంట్లు నీ నుంచి వినిపిస్తే మాత్రం బాగోదు' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అజయ్ తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు అడిగాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అజయ్.. అఖిల్, అషు రెడ్డికి వివరించాడు.


Click it and Unblock the Notifications











