Bigg Boss Non Stop నటరాజ్ మాస్టర్ దూకుడు.. ఆషురెడ్డికి షాక్.. సైబర్ క్రైమ్ దృష్టికి ఫ్యాన్స్ దిగజారుడుతనం

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతున్నది. కంటెస్టెంట్లు తమకు తోచిన విధంగా గ్రూప్‌ పాలిటిక్స్ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమవుతున్నది. ఇంటి సభ్యులందరిని ఎదురిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉండే విధంగా నటరాజ్ మాస్టర్ తీరు, ప్రవర్తన బిగ్‌బాస్ అభిమానులను ఆకట్టుకొంటున్నది. తాజా ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ గేమ్ ప్లాన్ ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల జరిగిన టాస్క్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ అషురెడ్డితో పోరాటం చేసిన తీరు మాస్టర్‌కు పాజిటివ్‌గా మారింది. ఇక తాజా ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, బిందు మాధవి, అషురెడ్డి మధ్య జరిగిన వివరాల్లోకి వెళితే..

ముక్కు సూటితనంతో

ముక్కు సూటితనంతో


బిగ్‌బాస్ తెలుగు 5 లో ఎంట్రీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్ తనదైన కామెంట్లతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మాస్టర్ తీరు కొందరికి ఇబ్బందిగా మారితే.. మరికొందరు కంటెస్టెంట్లకు ఉత్సాహాన్ని, పోరాట పటిమను కలిగించింది. అయితే బిగ్‌బాస్‌లో కొద్ది వారాలే ఉన్నప్పటికి.. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లు రావడంతో నటుడిగా మారేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.

నటరాజ్ మాస్టర్ ఆటతీరు

నటరాజ్ మాస్టర్ ఆటతీరు


ప్రస్తుత బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో నటరాజ్ ఆట తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఎలాంటి గ్రూప్‌లో చేరకుండా కౌశల్ మండా, అభిజిత్ దుడ్డాల ఆటతీరును గుర్తు చేస్తున్నారు. అయితే ఇంటి సభ్యుల నుంచి బలమైన ఎదురుదాడిని ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. అయితే బిందు మాధవి, అఖిల్ సార్థక్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ల నుంచి వ్యక్తిగత దూషణలు కూడా ఎదుర్కోవడం తెలిసిందే.

అషురెడ్డిని నిలదీసిన నటరాజ్ మాస్టర్

అషురెడ్డిని నిలదీసిన నటరాజ్ మాస్టర్

బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో ప్రస్తుత వారం జరుగుతున్న టాస్క్‌లో భాగంగా ఓ టాస్క్‌లో తనకు అన్యాయం జరిగిందనే విషయంపై అషురెడ్డిని నిలదీశాడు. అనిల్ రాథోడ్ మీకు ఓటు వేశారనే కారణంతోనే నన్ను టాస్క్ నుంచి డిస్ క్వాలిఫై చేశావని ముఖం మీదే చెప్పేసి నిలదీయడం నటరాజ్ మాస్టర్ ఆటతీరు ఏమిటో స్పష్టమైంది.
 నటరాజ్ ఫ్యామిలీపై అభ్యంతరంగా

నటరాజ్ ఫ్యామిలీపై అభ్యంతరంగా


అయితే నటరాజ్ మాస్టర్ దూకుడు తట్టుకొలేని కొందరు కంటెస్టెంట్ల డిజిటల్ మీడియా టీమ్స్ ఆయన వ్యక్తిగత జీవితంపై అక్కసు వెళ్లగక్కుతున్నారనే విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది. నటరాజ్ మాస్టర్ కుటుంబంపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండటం వివాదంగా మారింది. తమ కుటుంబంపై బురద జల్లే విధంగా, తమ ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో చవక బారు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగంలో కేసులు నమోదయ్యాయనే విషయం షాకింగ్‌గా మారింది.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
టాప్ కంటెస్టెంట్ల మధ్య సోషల్ మీడియా వార్

టాప్ కంటెస్టెంట్ల మధ్య సోషల్ మీడియా వార్


అయితే సోషల్ మీడియాలో నటరాజ్ మాస్టర్, ఇతర కంటెస్టెంట్ల మధ్య సోషల్ మీడియా వార్ గట్టిగానే జరుగుతున్నది. ఆట తీరుపై కాకుండా, ప్రొఫెషనల్‌గా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వారికి నటరాజ్ మాస్టర్ ఫాలోవర్స్ ధీటుగా ఎదుర్కొంటున్నారు. నటరాజ్ మాస్టర్ మాదిరిగా నిజాయితీగా గేమ్ ఆడాలని హితవు పలుకుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X