Bigg Boss Non Stop: ఫినాలే ముందు షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్.. ఆ ఇద్దరి వల్లే!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో స్పందనను సంపాదించుకుని.. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసేలాంటి కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోందీ షో. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత వినోదం దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఫినాలేకు ముందు జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ తాజాగా లీకైంది. మరి ఈ సారి ఎవరు వెళ్లారో చూద్దాం పదండి!

చివరి దశలో మరింత రంజుగా
తెలుగులో బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇది ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్ అవుతోంది. ఇక, ఇప్పుడు నడుస్తోన్న నాన్ స్టాప్ సీజన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటూనే ఉంది. ఫలితంగా ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరడంతో మరింత రంజుగా సాగుతూ మజా పంచుతోంది.

ఇప్పటికే 10 మంది బయటకు
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్, హమీదా ఖటూన్, అషు రెడ్డిలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

ఈసారి ఎలిమినేషన్స్ షాకింగ్
సాధారణంగా బిగ్ బాస్ షో మొత్తంగా ఎలిమినేషన్ ప్రాసెస్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి వారం ఈ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతోంది. ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇది షాకింగ్‌గా సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఎక్కువ మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా ఎలిమినేషన్‌పై అందరిలో డౌట్లు వస్తున్నాయి.

11వ వారం అంతా నామినేట్
ఎన్నో గొడవలతో రంజుగా సాగిన 11వ వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. ఫినాలేకు ముందు వారం కావడంతో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్‌లను నామినేట్ చేసినట్లు బిగ్ బాస్ పేర్కొన్నాడు. దీంతో ఈ వారం ఆసక్తికరంగా మారిపోయింది.

ఈ వారం కూడా గొడవలతోనే
ఫినాలేకు ముందు కావడంతో ఈ వారం మొత్తం యమ రంజుగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన నామినేషన్స్‌లో ఎన్నో గొడవలు కనిపించాయి. అలాగే, కొంత మంది సినిమా సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అలాగే, ఓట్ అప్పీల్ టాస్కులు కూడా జరిగాయి. ఇందులో గెలిచిన వాళ్లు ఆడియెన్స్‌ను ఓట్లు అభ్యర్ధించారు. ఇక, వారం చివర్లోనూ ఎన్నో గొడవలు జరిగాయి.

11వ వారం నటరాజ్ అవుట్
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 11వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ శనివారమే పూర్తైందట. ఊహించని విధంగా ఇందులో మరో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది. ఐదో సీజన్‌లో ఆకట్టుకోని ఆయన.. ఇందులో మాత్రం చక్కగా ఆడాడు. కానీ, కొన్ని గొడవల వల్ల పరువు పోగొట్టుకుని ఇప్పుడు వెళ్లిపోయాడు.
వాళ్లిద్దరితో పెట్టుకోవడం వల్లే
వాస్తవానికి ఈ వారం ఆరంభంలోనే అనిల్ రాథోడ్ తక్కువ ఓట్లతో ఉన్నాడట. అయితే, నటరాజ్ మాస్టర్ మొదట్లో బిందు మాధవితో, ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో గొడవలు పెట్టుకున్నాడు. అంతేకాదు, దేవుడితో మాట్లాడుతున్నా అంటూ వింతగా ప్రవర్తించాడు. దీంతో అతడికి ఓటింగ్ తగ్గిపోయిందట. ఫలితంగా ఫినాలేకు ఒక వారం ముందే నటరాజ్ ఎలిమినేట్ అయ్యాడని టాక్.


Click it and Unblock the Notifications











