For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌పై నటరాజ్ సంచలన వ్యాఖ్యలు.. బయట సెలెబ్రిటీలతో అలాంటి పనులంటూ!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలో పరిచయమైంది బిగ్ బాస్. అక్కడ దాదాపు పదిహేనేళ్ల క్రితమే వచ్చిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారం అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది ఆరేళ్లుగా సందడి చేస్తోంది. ఇప్పటికే ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను ఆరంభించారు.

  దీనికి మొదటి నుంచీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు అదే రీతిలో వినోదం కూడా దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ శివపై నటరాజ్ మాస్టర్ సంచలన ఆరోపణలు చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  సరికొత్త కంటెంట్.. భారీ రెస్పాన్స్

  సరికొత్త కంటెంట్.. భారీ రెస్పాన్స్

  ఎన్నో అంచనాలతో ప్రారంభం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఆరంభం నుంచే ఇందులో కంటెంట్ ఆకర్శవంతంగా ఉండడంతో పాటు బోల్డుగా కనిపించడంతో ఆడియెన్స్ ఫోకస్ చేస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌ ఓటీటీలో వచ్చినా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తోంది. దీంతో నిర్వహకులు మరింత జోష్‌తో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

  అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

  వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం

  వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన కంటెస్టెంట్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో యాంకర్ శివ ఒకడు. కాంట్రవర్శీ యాంకర్‌గా పేరొందిన అతడు.. ఈ షోలో మాత్రం చాలా వినోదాన్ని పంచుతున్నాడు. తద్వారా హైలైట్ అవుతున్నాడు. అయితే, నటరాజ్ మాత్రం తరచూ శివను టార్గెట్ చేస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది.

   నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పి

  నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పి

  గత వారం జరిగిన ఫ్యామిలీ టాస్కులో తన లుంగీని లాగాడని శివపై నటరాజ్ మాస్టర్ విరుచుకు పడ్డాడు. ఇందులో భాగంగానే అతడిపై 'ఎదవ.. హౌలే.. బోస్‌డీకే' అంటూ ఓ రేంజ్‌లో విరుచుకు పడ్డాడు. దీంతో ఈ పంచాయతీ నాగార్జున వరకూ వెళ్లింది. ఆదివారం ఎపిసోడ్‌లో ఈ వీడియోలను చూపించి నటరాజ్‌ను హెచ్చరించాడాయన. దీంతో అందరి ముందర సారీ చెప్పేశాడు.

  స్నానం చేస్తోన్న ఫొటోలు వదిలిన శ్రీయ: బ్రా మాత్రమే ధరించి మరీ దారుణంగా!

   జంటలుగా మార్చి నామినేషన్స్

  జంటలుగా మార్చి నామినేషన్స్

  ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ జంటలతో సాగింది. ఇందులో బిగ్ బాస్ చెప్పిన ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చి డిబెట్ పెట్టుకోవాలి. ఇందులో ఒకరు సేఫ్ అయి.. మరొకరు నామినేట్ అయ్యేలా మాట్లాడుకోవాలి. అలా జరగని పక్షంలో అక్కడ ఉన్న ఇద్దరూ నామినేట్ అవుతారు. అలాంటి సభ్యులు కుర్చీలో కూర్చుంటే పై నుంచి బురద నీళ్లు వాళ్లపై పడతాయి.

  యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్

  యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్

  ఈ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కులో బిగ్ బాస్ కాంట్రవర్శీలు అయ్యేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ఎవరెవరికి పడదో వాళ్లను జంటలుగా మార్చి గొడవలు క్రియేట్ అయ్యేలా చేశాడు. అందుకే ఈ టాస్కులో యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్‌ను జోడీగా చేశాడు బిగ్ బాస్. వీళ్లిద్దరూ ఆరంభంలో సైలెంట్‌గా నేను నామినేట్ అవను అని చెప్పుకున్నారు.

  మరోసారి హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దిశా పటానీ: ఏకంగా మేకప్‌ రూమ్‌లో అలా చూపిస్తూ!

   మళ్లీ అదే రీతిలో ప్రవర్తించాడు

  మళ్లీ అదే రీతిలో ప్రవర్తించాడు

  నామినేషన్స్ టాస్కులో మరోసారి నటరాజ్ మాస్టర్ రెచ్చిపోయాడు. ఇందులో భాగంగానే యాంకర్ శివపై దుర్భాషలాడాడు. 'నాకు దొంగతనాలు చేయడం రాదు. ఎప్పుడూ బెడ్ మీద కూర్చుని ఉండడం రాదు. ఒకరిని అడ్డం పెట్టుకుని ఆడడం రాదు. నేను జెన్యూన్‌గా ఆడుతున్నాను. నువ్వు దొంగవు.. లేజీ ఫెలోవు' అంటూ రెచ్చిపోయాడు. దీనికి శివ కూడా అదే రీతిలో కౌంటరిచ్చాడు.

   సెలెబ్రిటీలతో అలా చేయిస్తూ

  సెలెబ్రిటీలతో అలా చేయిస్తూ

  శివపై విరుచుకు పడుతోన్న సమయంలోనే నటరాజ్ మాస్టర్ 'నువ్వు బయట ఉన్న సెలెబ్రిటీలను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావు. వచ్చేటప్పుడే వాళ్లతో గూడుపుఠానీ చేసి వచ్చావు' అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో శివతో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఇక, వీళ్లు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో బిగ్ బాస్ ఈ ఇద్దరినీ ఈ వారానికి నామినేట్ చేసేశాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Nataraj Master Did Sensational Allegations on Anchor Shiva in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X