Bigg Boss Non Stop: బిందు మాధవిని కుమ్మేయాలి.. వాడుకోవడం అంటే తెలీదా.. షోలో మరో షాకింగ్ సీన్
బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. మిగిలిన భాషల్లో ఎప్పుడో పరిచయం అయినా.. తెలుగులో మాత్రమే తక్కువ సమయంలోనే మంచి స్పందనను దక్కించుకుంది. ఫలితంగా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో అఖిల్ సార్థక్ - బిందు మాధవి మధ్య జరిగే ఫైట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు మీకోసం!

వాటి కంటే ఎక్కువ మజా ఇస్తూ
ప్రారంభానికి ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. గతంలో కంటే కొత్త కొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య పెద్ద పెద్ద గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల హడావిడితో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతోంది. దీంతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదం కూడా అందుతోంది.

అఖిల్ బిందు టైటిల్ ఫేవరెట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఇక, ఇందులో ఇద్దరు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో ఒకరు తెలుగు హీరోయిన్ బిందు మాధవి కాగా.. మరొకరు నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్.

గేమ్, మైండ్‌గేమ్‌తో దూకుడుగా
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు మాధవి, అఖిల్ సార్థక్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా పోటాపోటీగా గేమ్స్ ఆడుతున్నారు. ఆట పరంగా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగానే ముందుకు వెళ్తున్నారు. అలాగే, మైండ్‌గేమ్ పరంగానూ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే టాస్కులను సులువుగా గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తద్వారా విజేతలుగా నిలుస్తున్నారు.

బిందును టార్గెట్ చేసిన బ్యాచ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో బిందు మాధవి - అఖిల్ సార్థక్ మధ్య ఆరంభం నుంచే కోల్డ్ వార్ నడుస్తోంది. అందుకే వీళ్లే తరచూ గొడవలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ అంటే నటరాజ్, అషు, అజయ్‌లు బిందును టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎన్నో వివాదాలు కూడా చెలరేగాయి. అయినా ఆమె ఎవరినీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది.

నామినేషన్స్‌లో స్రవంతి పేరు
గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్కులో బిందు మాధవి.. అఖిల్ సార్థక్‌ను నామినేట్ చేసింది. దీనికి ఆమె స్రవంతి పేరును వాడుకుంది. హౌస్‌లో ఉన్నప్పుడు అఖిల్.. స్రవంతిని బాగా వాడుకున్నాడని, వదిలేసిన తర్వాత ఆమె ఎలిమినేట్ అయిందని ఆరోపించింది. అయితే, వాడుకోవడం అనేది వేరే అర్థం చేసుకున్న అఖిల్ తెగ ఫీలైపోతూ పెద్ద గొడవనే చేశాడు.

బిందుపై నటరాజ్ కామెంట్లు
నామినేషన్స్‌లో జరిగిన గొడవ గురించి అఖిల్.. నటరాజ్ మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో నటరాజ్ 'వాడుకున్నావ్ అని ఆ బిందు నిన్ను మొదట్లో అన్నప్పుడే కుమ్మేయాల్సింది. ఎంత దారుణమైన పాయింట్ అదీ. అమ్మాయిని వాడుకోవడం ఏంటి? ఆ మాట ఏంటి? అసలు ఎవరైనా అలాంటి మాటలు అంటారా' అంటూ అఖిల్‌ను మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నమే చేశాడు.

చిత్రవధ చేయడమే ఆమె పని
అఖిల్ సార్థక్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే నటరాజ్ మాస్టర్.. బిందు మాధవిపై ఉన్న అక్కసునంతా వెల్లగక్కాడు. 'అసలు బిందు మాధవి అనే అమ్మాయి టాస్కులు ఆడుతుందా? బిగ్ బాస్‌లో మానసికంగా మనుషుల్ని చిత్రవధ చేయడమే ఆమె గేమ్. టాస్క్‌లు ఆడి ముందుకు వెళ్లడానికి హౌస్‌లోకి రాలేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Click it and Unblock the Notifications











