Bigg Boss Non Stop: నటరాజ్ కు కోలుకోలేని దెబ్బె.. కానీ ఆ ఒక్క రూట్లో జాక్ పాట్!

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ అనుకున్నట్లే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అతను టాప్ 5 వరకు కొనసాగుతాడు అనుకుంటే అందుకు కొద్దీ దూరంలోనే ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు నటరాజ్ హడావిడి చూసిన తరువాత అతను రెండు మూడు వారాలు ఉండడం కూడా డౌట్ అని అనుకున్నారు. కానీ 11 వారాల వరకు కొనసాగడం ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక అతను టాప్ 5 లోకి వెళ్లకపోయినప్పటికి ఒక రూట్లో మాత్రం జాక్ పాట్ కొట్టేశాడు. కెరీర్ లోనే బిగ్ బాస్ ద్వారా అతనికి అత్యధిక ఆదాయం లభించింది. వివరాల్లోకి వెళితే..

అనవసరమైన వివాదాలు

అనవసరమైన వివాదాలు

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ 5లోనే టైటిల్ విన్నర్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ సీనియర్ సెలబ్రెటీల దెబ్బకు తట్టుకోలేక కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. అనవసరమైన వివాదాలను సృష్టిస్తూ యాంకర్ రవి వలన కూడా కొంత వెనుకపడ్డాడు. అలాగే మరికొందరు కూడా నటరాజ్ మాస్టర్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఏదేమైనా నటరాజ్ మాస్టర్ చాలా తొందరగానే వెళ్లిపోవల్సి వచ్చింది.

ఆ విషయం మాత్రం పట్టించుకోలేదు

ఆ విషయం మాత్రం పట్టించుకోలేదు

బిగ్ బాస్ లో ప్రతీ ఒక్కరు కూడా గెలవడానికే ప్రయత్నం చేస్తారు. ఒకరి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఏ మాత్రం చెల్లదు అని అందరికి తెలిసిందే. అయితే అదే తరహాలో ఆలోచించిన నటరాజ్ మాస్టర్ పక్కా వాళ్ళు కూడా అదే తరహాలో ఆలోచిస్తారు అనే విషయం మాత్రం పట్టించుకోలేదు. నేనే గెలవాలి అనే స్వార్థం అయితే ఆయనలో ఎక్కువగా ఉండేది.

పిచ్చి పట్టినట్లు అరవడం

పిచ్చి పట్టినట్లు అరవడం

బిగ్ బాస్ 5లో ఒకవైపు ఎమోషనల్ గా మరోవైపు దురుసుగా ప్రవర్తించిన నటరాజ్ మాస్టర్ నాన్ స్టాప్ లో కూడా అదే తరహాలో పరవర్తించాడు. అనవసరంగా నిందలు వేయడం లేదంటే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ పిచ్చి పట్టినట్లు అరవడం కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నెంబర్ వన్ పొజిషన్ లో ఉండలనుకుని ఊహించాని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

ఆ ఎఫెక్ట్..

ఆ ఎఫెక్ట్..

ఏదేమైనా కూడా నటరాజ్ మాస్టర్ ఈసారైనా కప్ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన బిందుమాధవి అఖిల్ పై కామెంట్స్ చేసి ఎలిమినేట్ అయ్యే దశకు వచ్చాడు. ఆయనకు ఓట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. అసలు నటరాజ్ 11 వారాల వరకు ఉండడమే చాలా గ్రేట్ అని అనుకుంటున్నారు. అంతే కాకుండా నటరాజ్ మాస్టర్ వింతగా ప్రవర్తించడం ఏమి బాగోలేదని సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.

అత్యదిక ఆదాయాన్ని..

అత్యదిక ఆదాయాన్ని..

ఇక నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినప్పటికీ అతనికి ఒక విషయంలో మాత్రం జాక్ పాట్ వచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని వారాలకు గాను నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఉన్నందుకు తన జీవితంలోనే అత్యదిక ఆదాయాన్ని అందుకున్నాడు. రెమ్యునరేషన్ గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది. వారానికి లక్షకు పైగా అందుకున్న నటరాజ్ 8 వారాలకు గాను గోటల్ 8 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X