Bigg Boss Nominations: బిందుపై ఆ ముగ్గురు దాడి.. వాళ్లందరికీ షాకిచ్చిన బిగ్ బాస్.. ఒక్కరికి మాత్రం!

బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనాత్మక కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. దేశంలోనే మరే షోకూ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్. చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా జనరంజకంగా నడుపుతున్నారు. ఇక, ఇది తుది దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

అన్నింటినీ మించేలా సాగుతూ

అన్నింటినీ మించేలా సాగుతూ

గతంతో వచ్చిన ఐదు సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి. దీంతో ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే భారీ స్పందనను దక్కించుకుంటోంది. దీనికి కారణం ఇందులో చూపించే కంటెంటే అని తెలిసిందే. అందుకే ఇది పాత సీజన్లను మించేలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

ఇప్పటికే 10 మంది ఎలిమినేట్

ఇప్పటికే 10 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డిలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

హైలైట్‌ అవుతోన్న ఆ ఎపిసోడ్స్

హైలైట్‌ అవుతోన్న ఆ ఎపిసోడ్స్

బిగ్ బాస్ షో మొత్తంలోనే నామినేషన్స్.. ఎలిమినేషన్స్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. సాధారణంగా ప్రతి వారం ఇవి అనుకున్నట్లుగానే జరుగుతుంటాయి. కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇవి ఊహించని విధంగా సాగుతోంది. గడిచిన పది వారాలకూ గానూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఎవరూ అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లడంతో అందరిలో డౌట్లు కూడా వచ్చాయి.

11వ వారానికి నామినేషన్స్ ఇలా

11వ వారానికి నామినేషన్స్ ఇలా


11వ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

ఆ ముగ్గురితో బిందు బిగ్ ఫైట్

ఆ ముగ్గురితో బిందు బిగ్ ఫైట్

11వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా గొడవలతోనే సాగినట్లు తాజాగా వచ్చిన ప్రోమోను బట్టి చూస్తే అర్థం అవుతోంది. ఇందులో బిందు మాధవి.. మిత్ర శర్మ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్‌లను ఎంచుకుని నామినేట్ చేసింది. దీంతో వాళ్లు ఆమెపై మాటల దాడి చేశారు. నటరాజ్ అయితే ఏకంగా ఆమె తెలుగమ్మాయి కాదని.. వాళ్ల నాన్న మంచిగా పెంచలేదని అన్నాడు.

ఈ వారం నామినేట్ ఎవరంటే


ఎన్నో గొడవలతో రంజుగా సాగిన 11వ వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ నామినేట్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫినాలేకు ముందు వారం కావడంతో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివ, నటరాజ్‌ మాస్టర్‌లను నామినేట్ చేసినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు.

ఆయనకు మాత్రం బ్రహ్మాస్త్రం

ఆయనకు మాత్రం బ్రహ్మాస్త్రం


11వ వారానికి సంబంధించి అందరూ నామినేట్ అయ్యారు. అంటే ఫినాలేలోకి ఎవరు అడుగు పెట్టాలి అన్నది జనాల చేతిలోనే ఉంచారు. ఇక, ఈ వారం నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్‌కు మాత్రం 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉంది. దీంతో ఆయన ఈ వారం స్వయంగా తనను తాను సేఫ్ చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా వాడుకోవచ్చు. తనకే వాడుకుంటే ఫినాలేకు వెళ్లిపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X