Bigg Boss Nominations: టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్.. వాళ్లిద్దరు తప్ప అందరూ.. ఎలిమినేషన్ ప్రమాదంలో!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. అందుకే అలా పరిచయమై.. అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను నడుపుతున్నారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతోంది.

మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ మాత్రం ఊహించని విధంగా జరుగుతూ షాక్‌కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో 10వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్‌లో ఎవరు నామినేట్ అయ్యారో చూద్దాం పదండి!

వాటికి సంబంధం లేకుండానే

వాటికి సంబంధం లేకుండానే

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండానే ఈ సీజన్ సరికొత్త కంటెంట్‌తో నడుస్తోంది. ఇందులో గత సీజన్లలో జరిగిన వాటికి ఏమాత్రం సంబంధం లేని సీన్స్ కనిపిస్తున్నాయి.

ఇప్పటికే 9 మంది ఎలిమినేట్

ఇప్పటికే 9 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 9 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

నామినేషన్స్... ఎలిమినేషన్స్

నామినేషన్స్... ఎలిమినేషన్స్

బిగ్ బాస్ మొత్తంలోనే నామినేషన్స్.. ఎలిమినేషన్స్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. సాధారణంగా ప్రతి వారం ఇవి అనుకున్నట్లుగానే జరుగుతుంటాయి. కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఇవి ఊహించని విధంగా సాగుతోంది. గడిచిన తొమ్మిది వారాలకూ గానూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఎవరూ అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

10వ వారం నామినేషన్స్ ఇలా

10వ వారం నామినేషన్స్ ఇలా

పదో వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారి నోట్లో చేదు లడ్డూ పెట్టాలని చెప్పారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి, అందుకు తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ ప్రక్రియలో చివరి కెప్టెన్ అయిన బాబా భాస్కర్‌ను ఎవరూ నామినేట్ చేయొద్దన్నాడు.

గొడవలతో రసవత్తరంగా సాగి

గొడవలతో రసవత్తరంగా సాగి

తాజాగా జరిగిన నామినేషన్ ప్రక్రియ మొత్తం గొడవలతోనే సాగింది. సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే తమను నామినేట్ చేసిన వాళ్లపై ఫైర్ అయ్యారు. అలా బిందు మాధవి - మిత్రా శర్మ, అఖిల్ - ఆరియానా గ్లోరీ, అషు రెడ్డి - యాంకర్ శివ, అనిల్ రాథోడ్ - అషు రెడ్డి ఇలా కొందరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఈ వారం నామినేట్ ఎవరంటే

ఈ వారం నామినేట్ ఎవరంటే

ఎన్నో గొడవలతో రంజుగా సాగిన పదో వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, అషు రెడ్డి, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివలు ఉన్నారు. కెప్టెన్ అయినందున బాబా భాస్కర్‌ను ఎవరూ నామినేట్ చేయలేదు. అలాగే, నటరాజ్ మాస్టర్‌ కూడా ఇందులో సేఫ్ అయ్యాడు.

ఓటింగ్ మాత్రం రసవత్తరం

ఓటింగ్ మాత్రం రసవత్తరం

పదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఏడుగురు నామినేట్ అవగా.. అందులో దాదాపు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్ ఎలా జరగబోతుంది అన్న ఆసక్తి ఇప్పటి నుంచి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టైటిల్ ఫేవరెట్లుగా చెప్పుకుంటోన్న బిందు, అఖిల్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో కూడా టెన్షన్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X