Bigg Boss Nominations: నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్.. అషు వల్ల అతడు బలి.. ఈ వారం 8 మందికి షాక్
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అయితే, చాలా తక్కువ షోలు మాత్రం సంచలనం మారి రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకుల మదిని దోచుకుంటోన్న ఇది ఐదు సీజన్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఇందులో ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్ కనిపించింది. దీంతో మొత్తంగా ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

వినోదాన్ని పంచుతోన్న బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా నాన్ స్టాప్‌గా వినోదాన్ని అందిస్తోంది.

6 వారాల్లో.. ఆరుగురు ఎలిమినేట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు ఎలిమినేట్ అయిపోయారు.

జంటలుగా మార్చి నామినేషన్స్
ఏడో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ జంటలతో సాగింది. ఇందులో బిగ్ బాస్ చెప్పిన ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చి డిబెట్ పెట్టుకోవాలి. ఇందులో ఒకరు సేఫ్ అయి.. మరొకరు నామినేట్ అయ్యేలా మాట్లాడుకోవాలి. అలా జరగని పక్షంలో అక్కడ ఉన్న ఇద్దరూ నామినేట్ అవుతారు. నామినేట్ అయ్యే సభ్యులు కుర్చీలో కూర్చుంటే పై నుంచి బురద నీళ్లు వాళ్లపై పడతాయి.

3 జంటలు గొడవలు లేకుండానే
ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ముందుగా బిగ్ బాస్ హమీదా, అనిల్‌ను పిలిచాడు. ఇందులో హమీదాను చూస్తే తనకు ఎమోషన్స్ వస్తాయని చెప్పి అనిల్ నామినేట్ అయ్యాడు. అలాగే, మహేశ్ విట్టా కోసం మిత్రా శర్మ నామినేషన్స్‌లోకి వెళ్లిపోయింది. ఇక, అజయ్‌ను సేఫ్ చేస్తూ ఆరియానా గ్లోరీ కూడా తనను తాను నామినేట్ చేసుకుని రిస్క్ చేసేసింది.

ఆ రెండు జంటల మధ్య గొడవ
ఇక, ఈ నామినేషన్స్ టాస్కులో యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య భీకరమైన ఫైటింగ్ జరిగింది. ఒకరిని ఒకరు నిందిస్తూ గొడవ పడ్డారు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ నామినేట్ చేసేశాడు. అలాగే, బిందు మాధవి, అఖిల్ సార్థక్ కూడా శృతి మించిన మాటలతో రెచ్చిపోయారు. వీళ్లలో కూడా కాంప్రమైజ్ కాకపోవడంతో బిగ్ బాస్ వీళ్లిద్దరినీ కూడా నామినేట్ చేసి భారీ షాక్ ఇచ్చేశాడు.

అషు రెడ్డికి పవర్.. అతడు బలి
నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందని అనుకున్న సమయంలోనే కెప్టెన్ అషు రెడ్డికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. దీని ప్రకారం.. సేఫ్‌గా ఉన్న వాళ్ల నుంచి ఒకరిని ఈ వారానికి నామినేట్ చేయొచ్చని చెప్పాడు. దీంతో అషు మరో ఆలోచన లేకుండా మహేశ్ విట్టాను నామినేట్ చేసింది. ఈ సమయంలో పెద్ద గొడవే జరిగింది. అప్పుడు అషుకు అఖిల్, అజయ్ సపోర్ట్ చేశారు.

మొత్తంగా ఎనిమిది మంది బుక్
ఏడో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్‌లు ఉన్నారు. అజయ్, హమీదా తప్పించుకున్నారు.


Click it and Unblock the Notifications











