బిగ్ బాస్ సంచలన నిర్ణయం: కొత్త సీజన్ ఇక లేనట్లే.. ఆ ఛానెల్ చేతికి వెళ్లడం వల్లే ఇలా!
బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విశేషమైన ప్రేక్షకాదరణతో టాప్ ప్లేస్‌కు చేరుకుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ వచ్చిన ఈ కార్యక్రమం.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయింది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వెళ్తున్నారు. దీనికితోడు ఏడో సీజన్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో కొత్తగా వచ్చే వాటిపై ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే రాబోయే సీజన్‌పై బిగ్ బాస్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీకోసమే!
భారీ స్పందనతో కంప్లీట్:అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. తెలుగులో నెంబన్ వన్ అయిన షోనే బిగ్ బాస్. అందుకే నిర్వహకులు అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు సాధించాయి.

ఏడో సీజన్‌తో ఫుల్ జోష్:తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు సక్సెస్ అవడంతో బిగ్ బాస్ టీమ్ ఇటీవలే ఏడో దానిని తెచ్చింది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో ప్రశాంత్ గెలిచాడు. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు రికార్డు రేటింగ్ నమోదైంది.
ఓటీటీ సీజన్ 2కు ప్లాన్స్:ఉల్టా పుల్టాగా సాగిన ఏడో సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని ఇటీవలే తెలిసింది. ఫలితంగా ఈ సీజన్‌పైన కూడా అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

డేట్ కూడా ఫిక్స్ అంటూ:రెండేళ్ల క్రితం వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ను అంతకు మించేలా రెడీ చేయబోతున్నారట. దీన్ని వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని పది వారాల పాటు అంటే 70 రోజులు ప్రసారం చేయబోతున్నారని ఇప్పటికే న్యూస్ లీకైంది.
కొత్త సీజన్ క్యాన్సిల్ చేసి:బిగ్ బాస్ ఏడో సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ గురించి అప్పుడే ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది ప్రసారం కానున్న ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహకులు రద్దు చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

ఆ చానెల్ బుక్ చేసింది:బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ ఫిబ్రవరిలోనే ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా దీన్ని రద్దు చేశారని తెలిసింది. అంతేకాదు, బిగ్ బాస్ సెట్ వేసే స్టూడియోను మరో ఛానెల్ కొత్త షో కోసం బుక్ చేసుకుందని కూడా న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఈ సీజన్‌ను ఎందుకు రద్దు చేశారు అన్న విషయం మాత్రం తెలియలేదు.


Click it and Unblock the Notifications











