Bigg Boss Telugu: బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సీజన్‌పై ఊహించని నిర్ణయం
ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటిన షోనే బిగ్ బాస్. అందుకే ఇది ఎలాంటి ఆటంకం లేకుండా వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని కూడా నిర్వహకులు గ్రాండ్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ సీజన్‌ను మొదలెడతారని వార్తలు వచ్చాయి. కానీ, ఇది క్యాన్సిల్ అయినట్లు ఇటీవలే న్యూస్ హైలైట్ అయింది. అయితే, దీనిపై తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
దేశంలోనే టాప్ రేటింగ్‌తో:ఎన్నో అనుమానాల నడుమ తెలుగులో ప్రారంభం అయినా.. బిగ్ బాస్ తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దీంతో నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. తద్వారా దేశంలోనే టాప్ షోగా ఇది నిలిచింది.

ఏడో సీజన్‌తో రెట్టింపుగా:బిగ్ బాస్ రెగ్యూలర్ సీజన్లలో నాలుగు, ఐదు సీజన్ల మాదిరిగా ఆరోది సక్సెస్ కాలేదు. దీంతో ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఏడో దాన్ని ఇటీవలే మొదలు పెట్టారు. ఇందులో గతంలో కంటే భిన్నమైన కంటెంట్‌ను చూపించారు. ఫలితంగా ఈ సీజన్ ఎన్నో ట్విస్టులతో రసవత్తరంగా సాగింది. ఫలితంగా భారీ స్పందతో రికార్డు రేటింగ్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ టీమ్‌లో జోష్ కూడా వచ్చింది.
రెండో సీజన్‌కు ఏర్పాట్లు:బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో నిర్వహకులు ఓటీటీ వెర్షన్ అయిన నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఫలితంగా ఈ సీజన్‌పైన ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డ విషయం తెలిసిందే.

కొత్త సీజన్ క్యాన్సిల్ అని:బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ ప్రారంభం గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. అదే సమయంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహకులు రద్దు చేసినట్లు తాజాగా కొద్ది రోజుల క్రితమే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో బిగ్ బాస్ షోను ఇష్టపడే వాళ్లంతా నిరాశకు లోనయ్యాయి.
బిగ్ బాస్ టీమ్ యూటర్న్:బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ రద్దు అయినట్లు వచ్చిన వార్తలతో ప్రేక్షకులు నిరాశగా ఉన్నారు. దీంతో షో యూనిట్ దీనిపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. అందుకే కొత్త సీజన్‌ను రద్దు చేయకుండా వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించుకుందట. అంతేకాదు, దీన్ని ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొదలు పెట్టే అవకాశం ఉందని తాజాగా న్యూస్ లీక్ అయింది.


Click it and Unblock the Notifications











