Bigg Boss Non Stop: పాపకు దిమ్మ తిరిగే షాక్.. ఎలిమినేట్ అయినట్లే.. భారీగా తగ్గిన ఓట్లు!
బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకు కంటెస్టెంట్స్ అందరూ కూడా విభిన్నమైన రకాల హావభావాలతో వారి బలాన్ని ప్రదర్శించేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఇక ఈ వారం ఒక కంటెస్టెంట్ ఎంతో కష్టపడినప్పటికీ కూడా చివరికి హౌస్ లో నుంచి వెళ్లి పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. ఇక చివరి వారంలో ఎలిమినేషన్ అయితే ఉండదు. దీంతో మిగిలిన రెండు వారాల్లో టాప్ ఫైవ్ లో కి వెళ్లే కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎవరు వెళ్ళిపోతున్నారు? టాప్ ఫైవ్ లో ఉండేది ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

ఎలిమినేషన్స్ ఎలా?
హౌస్ లో మిగిలిన తొమ్మిది మంది ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో ఒకరు ఎలిమినేషన్ కు సిద్ధమయ్యారు. అయితే మిగిలిన రెండు వారాల్లో ఇంకా ముగ్గురు ని ఎలా ఎలిమినేట్ చేస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఈ వారం డబుల్ ఎలిమినేట్ చేసిన తర్వాత మరుసటి వారం ఎలిమినేషన్ ఉండవచ్చు. లేదంటే మధ్యలో మరొకరిని పంపించవచ్చు అని కూడా వస్తోంది.

టాప్ సిక్స్..?
అసలైతే ఈ వారం కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేయవచ్చు అని టాక్ వచ్చింది కానీ ఇప్పుడే ఆ స్థాయిలో రిస్క్ చేయకూడదని బిగ్ బాస్ మళ్లీ వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఇక మిగిలిన ఎనిమిది మందిలో మరుసటి వారం ఇద్దరిని పంపించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఈసారి సీజన్ లో సరికొత్తగా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ తో ఫైనల్ ఎపిసోడ్ను కొనసాగించిన కొనసాగించవచ్చని కూడా టాక్ వస్తోంది.

బాబా భాస్కర్.. లక్కీ ఛాన్స్
రీసెంట్ గా బాబా భాస్కర్ ఏవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకోవడంతో అతను హ్యాపీగా టాప్ 5 లోకి అడుగు పెట్టినట్లు గా అనిపిస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ ఊహించని విధమైన పరిస్థితులలో ఫైనల్స్ వరకు చేరుకోవాల్సి వచ్చింది. మధ్యలోనే అతను వెళ్ళి పోతాడు అని అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు మొత్తం అతనికి బాగానే అనుకూలించాయి.

వాళ్ళు సేఫ్..
ఇక ఇప్పుడు మొత్తం ఏడు మంది నామినేషన్స్ లో ఉన్నారు అందులో యాంకర్ శివ, అరియానా, అషు రెడ్డి మిత్రశర్మ, బిందుమాధవి, అనిల్ రాథోడ్ ఇలా ఏడుగురు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించింది. ఏడుగురు లో ఎందుకు బిందుమాధవి, యాంకర్ శివ, సేఫ్ అని ప్రేక్షకుల ముందుగానే ఊహించారు.

అషు రెడ్డి ఎలిమినేట్!
ఇక ఫైనల్ గా ఈ వారం అషు రెడ్డి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓట్ల విషయంలో అయితే అఖిల్ మళ్లీ టాప్ లో ఉండగా అతనికి బిందుమాధవి రెండవ స్థానంలో పోటీ గా నిలుస్తోంది. ఇక ఆ తర్వాత యాంకర్ శివ, మిత్రశర్మ, అరియానా, అనిల్ తర్వాత సంఖ్యలో ఉన్నారు. ఇక చివరికి అషు రెడ్డి ఆడియన్స్ సపోర్ట్ కోల్పోవడంతో ఈ వారం ఆమెకి భారీగా తగ్గిన ఓట్ల కారణంగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











