Bigg Boss Non Stop: చెమటలు పట్టిస్తున్న ఆడపులి బిందుమాధవి.. న్యూ రికార్డ్ పక్కా!

బిందు మాధవి మొదటి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకిలోకి అడుగు పెట్టినప్పుడు ఎక్కువ రోజులు ఉండదు అని కామెంట్ చేస్తే చాలానే వచ్చాయి. ఎందుకంటే ఆమె చాలా సైలెంట్ గా ఉంటుంది అని చూడగానే చెప్పవచ్చు అని అందరు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి బిందుమాధవి తన పర్సనల్ లైఫ్ విషయంలో కూడా చాలా కూల్ గానే ఉంటుంది. మొదటి వారంలో ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెను అభిమానులు ఒక ఆడ పులి తరహాలో చూస్తూ ఉండడం విశేషం. ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక స్పెషల్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు అమ్మాయిగా..

తెలుగు అమ్మాయిగా..

ఆవకాయ బిర్యాని సినిమాతో చాలా ఇన్నోసెంట్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బిందుమాధవి తెలుగు అమ్మాయి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఆమె తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ తమిళం ఇండస్ట్రీలో మాత్రం మొన్నటి వరకు చాలా బిజీ గానే కనిపించింది. ఇక మొదటి సారి బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 మొదటివారం..

మొదటివారం..

అసలైతే బిగ్ బాస్ లోకి బిందుమాధవి రాగానే ఆమె ఎక్కువ రోజులు ఉండదేమో అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎందుకంటే బిందుమాధవి మొదటివారం చాలా సైలెంట్ గానే కొనసాగుతూ వచ్చింది. అవసరమైతే కానీ ఎదుటి వారితో ఆమె ఏ విషయం గురించి కూడా చర్చలు జరపలేదు.

సింహం సింగిల్ గానే..

సింహం సింగిల్ గానే..

ప్రస్తుతం బిందుమాధవి మాత్రం బిగ్ బాస్ అండ్ నాన్ స్టాప్ లో నెంబర్ వన్ కంటెస్టెంట్ గా ప్రత్యర్థులకు పోటీని ఇస్తోంది. గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆటను ముందుకు సాగిస్తున్న ప్రత్యర్థి కంటెస్టెంట్స్ కు ఆమె సింహం సింగిల్ గా వస్తుంది అనే తరహాలోనే కౌంటర్లు ఇస్తుంది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో సహనంతో ఆటలో ముందుకు సాగుతోంది.

ఆడపులి బిందు మాధవి

ఆడపులి బిందు మాధవి

బిందు మాధవి కి సంబంధించిన ప్రత్యేకమైన ట్యాగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆడపులి బిందు మాధవి అనే ట్యాగ్ ట్విట్టర్లో అయితే ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.. రీసెంట్ గా ఆమె పవర్ఫుల్ కంటెస్టెంట్ అఖిల్ కు పోటీగా సోలో ఫైట్ ఇచ్చిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నేను ఒక అమ్మాయిలా ఫైట్ చేస్తా ఒక అబ్బాయిలా పోరాడతా అంటూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసింది.

తుఫాను వచ్చే ముందు

తుఫాను వచ్చే ముందు

బిందు మాధవిని చూస్తే ప్రతి సారి కూడా తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనేలా గుర్తింపును అందుకుంటోంది. ఎవరైనా మోసం చేసి గేమ్ ఆడితే మాత్రం అప్పుడే నిలదీసే ప్రయత్నం చేస్తోంది. అసలు బిగ్ బాస్ షోలో బిందుమాధవి వారం కూడా ఉండడం కష్టమే అని అనుకున్నారు. ఇప్పుడు ఆమె ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి.

గెలిస్తే మాత్రం..

గెలిస్తే మాత్రం..

ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ అన్నిటిలో కూడా అబ్బాయయూ ఫైనల్ విన్నర్స్ గా నిలుస్తూ వచ్చారు. శ్రీముఖి గీతామాధురి వంటి వాళ్ళు బిగ్ బాస్ టైటిల్ లో ఆఖరి ఘట్టంలో పోరాడారు కానీ గెలవలేదు. కానీ ఈ సారి ఆడపులి బిందుమాధవి దూకుడు చూస్తూ ఉంటే మాత్రం బిగ్ బాస్ లో ఫస్ట్ మహిళా గా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఆమెకు అఖిల్ నుంచి ఎలాంటి పోటీ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X