Bigg Boss Non Stop: అఖిల్ దూరం పెడితే అంతేనా.. అజయ్ తరువాత వెళ్లిపోయేది ఎవరంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పుడు ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం కంటెస్టెంట్స్ విషయంలో తీవ్రంగా నిరాశ ఎదురైంది. మళ్లీ పాత కంటెస్టెంట్స్ ను తీసుకురావడం ఓ వర్గం వారికి ఏ మాత్రం నచ్చలేదు. అయితే బిగ్ బాస్ మాత్రం ఎప్పటికప్పుడు ఆటను మార్చేస్తూ మరింత ఆసక్తికరంగా చేస్తున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అయితే మధ్యలో కాస్త నిరాశ పరిచినప్పటికీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక ఈ మొదటి ఓటీటీ సీజన్లో అఖిల్ గ్యాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అఖిల్ తో మొదట స్నేహంగా ఉండి ఆ తర్వాత దూరమైన వాళ్ళు వెంటనే హౌస్ లో నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం మరొక విషయం లో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

న్యాయం జరగడం లేదు..
బిగ్ బాస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బలంగా నిలదొక్కుకుని ముందుకు సాగితేనే చివరివరకు నిలుస్తారు ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ఆడియన్స్ నుంచి మద్దతు కోల్పోవలసి వస్తుంది. అయితే ఆడియన్స్ కోసం ఆడినప్పటికీ కూడా కొంతమందినీ కావాలని హౌస్ లో నుంచి తప్పిస్తున్నట్లు గా అనేక రకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎలిమినేషన్ లో అసలు న్యాయం జరగడం లేదు అని కూడా చెబుతున్నారు.

పక్షపాతం..
ఎలిమినేషన్ మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ విషయంలో అనేక రకాల అనుమానాలు అయితే వెలువడుతున్నాయి. కానీ బిగ్ బాస్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అఖిల్ గ్యాంగ్ కు సంబంధించిన ఎలిమినేషన్ విషయంలో పక్షపాతం కొనసాగుతోంది అనిపిస్తోంది.

అఖిల్ తో విడిపోతే..
అయితే అఖిల్ తో మొదట స్నేహంగా ఉన్న వారు ఆ తర్వాత గొడవపడడి విడిపోతే మాత్రం వెంటనే ఆ హౌస్ లో నుంచి వెళ్ళిపోతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చాలా వరకు కొంతమంది కంటెస్టెంట్స్ అఖిల్ గెలవడం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారు. అయితే చివరికి వాళ్ళు బొక్క బోర్లా పడుతుండటం విశేషం.

కొన్ని వారాల పాటు
అఖిల్ గ్యాంగ్లో అషు రెడ్డి అజయ్ స్రవంతి కొన్ని వారాల పాటు చాలా స్నేహంగా కొనసాగారు. ఎవరు ఎన్ని గొడవలు సృష్టించిన కూడా ఈ నలుగురు ఒకే దారిలో నడిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం చాలా పకడ్బందీగా ఇతరులను టార్గెట్ చేయడం ప్రేక్షకులకు కూడా ఏమాత్రం నచ్చలేదు. ఇక ఆ ప్రభావం పడడానికి ఎంతో సమయం పట్టలేదు.

అజయ్ ఎలిమినేట్?
స్రవంతి తర్వాత అజయ్ పై కూడా డా గట్టి ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది. అసలైతే అజయ్ కు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వరకూ పెద్దగా క్రేజ్ అయితే లేదు. అఖిల్ తో కొనసాగుతున్నాడు అనే ఒక కారణంచేత అతనికి ఎంతోకొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఇక చివరికి అఖిల్ తో కూడా అతను దూరమవడంతో ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో..
అఖిల్ గ్యాంగ్ లో ఉన్న స్రవంతి, అజయ్ తరువాత మిగిలిన అషు రెడ్డి కూడా ఆ తర్వాత వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ లో ఎవరు ఎంతో స్నేహంగా కొనసాగిన కూడా కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గి పోయిన కొద్దీ వారి మధ్య దూరం కూడా పెరుగుతుంది. కాబట్టి అఖిల్ అషు మధ్య రాబోయే రోజుల్లో గొడవలు రాకుండా ఉండవు కాబట్టి అఖిల్ దెబ్బకు అషు బలి అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











