Bigg Boss non Stop: వచ్చే సీజన్ లో ఇద్దరికి మరో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన కంటెస్టెంట్!
మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మంచి గుర్తింపు అందుకుని ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. నిన్నటి తో ఫైనల్ ఎపిసోడ్ ముగించుకున్న బిగ్ బాస్ ఇంకా 6వ సీజన్ ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకులలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే ఆరో సీజన్ లో కూడా ఇప్పుడు నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొన్న వారిలో ఒక ఇద్దరు మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే విషయంపై ఒక బలమైన కంటెస్టెంట్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఇన్ని రోజుల పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అసలు మొదట ఈ షోలోకి అడుగుపెట్టిన వారిలో కొంతమంది మొదట్లోనే వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ అందులో కొందరు టాప్ ఫైవ్ లోకి రావడం విశేషం. బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ లతో ఈసారి నాన్ స్టాప్ సీజన్ లో కూడా చాలా హైలెట్గా ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇక బలమైన కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కున్నారు.

ముందే తెలిసిన విజయం
టాప్ ఫైవ్ లోకి వచ్చినప్పుడు టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంలో అయితే ముందుగానే జనాలకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బిందుమాధవి తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుంటుంది అనే ఒక వారం ముందే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక అఖిల్ కూడా రన్నరప్ గా నిలుస్తాడు అని ముందుగానే ఊహించారు.

న్యూ రికార్డ్
అయితే బిగ్ బాస్ షోలో బిందుమాధవి గెలవడం ద్వారా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ అయింది అని చెప్పాలి. ఇప్పటివరకు తెలుగుకు సంబంధించిన బిగ్ బాస్ చరిత్రలో ఒక్క మహిళ కూడా టైటిల్ ను సొంతం చేసుకున్నది లేదు. గతంలో గీతామాధురి శ్రీముఖి తుది దశ వరకు వచ్చే చివరలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ బిందుమాధవి మాత్రం బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్న మొదటి అమ్మాయి గా నిలిచింది.

ఆరవ సీజన్
అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సీజన్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్పుడు కూడా నాగార్జున మళ్లీ హోస్ట్ గా కొనసాగుతాడు అని తెలుస్తోంది. అయితే ఈసారి ఓటీటీ లో కాకుండా డైరెక్టుగా టెలివిజన్ లోనే మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోసారి రీ ఎంట్రీ
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వచ్చే బిగ్ బాస్ ఆరో సీజన్లో ఇటీవల పాల్గొన్న మరొక ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరూ ఊహించనటువంటి కొంచెం పేరున్న సెలబ్రిటీలను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

క్లారిటీ ఇచ్చిన అఖిల్
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు కూడా మరొకసారి బిగ్ బాస్ లో కి అవకాశం వస్తే వెళ్తారా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మళ్లీ వెళ్తాను అంటూ అందులో ఎలాంటి సందేహం లేదు అని కూడా అన్నారు. మరి మరోసారి అఖిల్ బిగ్ బాస్ ఆహ్వానిస్తుందో లేదో తదుపరి సీజన్ మొదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











