Bigg Boss Non Stop: అంత తిట్టినా మళ్ళీ అతని వెంటే బిందుమాధవి.. 'తూ' అనడం తప్పే అంటూ..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఫైనల్ స్టేజ్ కు చేరుకునే కొద్దీ మరింత సీరియస్ గా మారుతుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా టాప్ ఫైవ్ లో నిలిచేందుకు వారి శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు అనే చెప్పాలి. ఎలాంటి టాస్క్ మొదలైన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు కూడా హౌస్ లో పరిస్థితులను మార్చేస్తున్నాయి.
ఇక బిందుమాధవి.. అఖిల్ తర్వాత మరొక వ్యక్తి పై మొదటి సారి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అతని విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. ఇక బిందుమాధవి కారణంగా అతను టాప్-5లో నిలిచే అవకాశం లేదని కూడా అనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రతి ఒక్కరు షాక్
బిగ్ బాస్ నాన్ స్టాప్ 90 ఎపిసోడ్ అయితే కాస్త విభిన్నంగానే కొనసాగింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ తీరుపై ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. సాధారణంగా నటరాజ్ మాస్టార్ పరిస్థితులు అనుకూలించక పోతే మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉంటాడు. అంతేకాకుండా పిచ్చిగా ప్రవర్తిస్తాడని కూడా అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా కూడా అతను మరొకసారి బార్డర్ లైన్ దాటి వేసి మరీ పిచ్చిగా ప్రవర్తించాడు.

టాప్ 5 కోసం..
టాప్ 5 లో స్థానం కోసం పోటీ పడేందుకు ప్రతి ఒక్కరు కూడా టాస్క్ లో ఫైట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మధ్యలోనే వెళ్ళిపోతారు అనుకున్న నటరాజ్ మాస్టర్ ఇక్కడి వరకు బాగానే వచ్చారు. ఇక ఆయన వెకిలి చేష్టలు చూసి కంటెస్టెంట్స్ అయితే పట్టించుకోవడం కూడా మానేస్తున్నారు. ఇక టాప్ 5 కోసం ఇటీవల ఆయన బిందుమాధవి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో నెగిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది.

అలా గాలి తీసేసిన నటరాజ్
బిందు మాధవి పర్సనల్ విషయాల పై అలాగే వారి తల్లిదండ్రుల పెంపకం పై కూడా నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా టార్గెట్ చేయడం ఎవరికీ అంతగా నచ్చలేదు. అసలు బిందు మాధవికి టాప్ ఫైవ్ లో నిలిచే అర్హత కదా కూడా లేదు అని నటరాజ్ మాస్టర్ మొహం మీదే చెప్పేసాడు. అసలు ఆమె ఇన్ని రోజుల్లో ఏలాంటి టాస్క్ లో కూడా పోరాడింది లేదు అని కేవలం మాటల వరకే గాలి తీసే ప్రయత్నం చేశాడు.

అలా అనడం తప్పే..
ఇక రీసెంట్ గా బిందు మాధవి నటరాజ్ మాస్టర్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నాలు అయితే చేసింది. ఉదయాన్నే యాంకర్ అనిల్ బిందు మాధవి ముగ్గురు కూడా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకున్నారు. ఆయనకు సారీ చెప్పాలని ఉంది అని కానీ ముందుకు వెళ్ళలేక పోతున్నట్లుగా బిందుమాధవి తెలియజేసింది. అతనిపై 'తూ' అని కామెంట్ చేయడం తప్పే కానీ ఆయన పర్సనల్ గా పెంపుదలపై కామెంట్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అనే బిందు వివరణ ఇచ్చింది.

బిందుమాధవి గ్రేట్..
ఏదేమైనా బిందు నటరాజ్ మాస్టర్ కు సారీ చెప్పాలని అనుకోవడం తో ఆమెకు అభిమానులలో మరింత ఆదరణ పెరిగింది. బిందు మాధవి పర్సనల్ గా ఎవరిని ఏటాక్ చేయదనే ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనిల్ కూడా బిందుమాధవి కి సపోర్ట్ చేస్తూ ఏదేమైనా కూడా నువ్వు ఒకసారి.. సారీ చెబితే అంతా సర్దుకుంటుంది అనే వివరణ ఇచ్చాడు. ఇక బిందుమాధవి నటరాజ్ మాస్టర్ తో మాట్లాడితే అది ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది అని చెప్పాలి. మరి నటరాజ్ మాస్టర్ బిందు మాధవికి క్లోజ్ అవుతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











