twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: చరిత్ర సృష్టించబోతున్న కంటెస్టెంట్.. ఫైనల్ విన్నర్ న్యూ రికార్డ్

    |

    బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో అయితే ప్రేక్షకులు కొంత నిరాశ చెందారు. కొత్తవారిని ప్రముఖ సెలబ్రెటీలను తీసుకు వస్తారు అని అనుకుంటే పాతవారిని అలాగే పెద్దగా స్టార్ హోదా లేని వారిని కంటెస్టెంట్ గా తీసుకురావడం ఓ వర్గం ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. కానీ బిగ్ బాస్ మాత్రం ఎప్పటిలానే తన దైన శైలిలో టాస్క్ లతో షోపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. దీంతో ఆ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా జనాలకు కనెక్ట్ అయిపోయారు. ఇక ఇప్పుడు గెలవబోయే కంటెస్టెంట్స్ అయితే చరిత్ర సృష్టించబోతున్నారు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    సక్సెస్ అవుతుందా లేదా?

    సక్సెస్ అవుతుందా లేదా?

    బిగ్ బాస్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే అసలు మొదట షో తెలుగు లో మొదలైనప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇక మొదట ఈబీషో హోస్ట్ కోసం నిర్వాహకులు చాలామంది అగ్రహీరోలు సంప్రదించగా.. చివరికి ఎన్టీఆర్ మొదటి సీజన్ మొదలుపెట్టాడు. ఇక తర్వాత నాని, నాగార్జునతో మరింత హైప్ క్రియేట్ చేశారు.

    ఫైనల్ కోసం.

    ఫైనల్ కోసం.

    ముఖ్యంగా నాగార్జున గత కొంతకాలంగా బిగ్ బాస్ కు ప్రత్యేకంగా పోస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రసారమవుతున్న 24 గంటల బిగ్ బాస్ షోకు కూడా ఆయనే మళ్ళీ సరికొత్తగా హోస్ట్ గా వ్యవహరించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సారి బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక ప్రముఖ సెలబ్రెటీ కూడా ప్రత్యేక అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.

    టైటిల్ విన్నర్ ఎవరు?

    టైటిల్ విన్నర్ ఎవరు?

    మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు మొదటి స్థానంలో నిలుస్తారు అలాగే చివరి స్థానంలో నిలుస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేలా కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ కొనసాగుతోంది.

    బిందుమాధవి విన్నర్!

    బిందుమాధవి విన్నర్!

    బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఆడియన్స్ అయితే ఇంతకు ముందే ఒక ఊహించేసుకున్నారు. అందరూ ఊహించినట్టే బిందుమాధవి గెలుస్తుంది అని కూడా అర్థం అవుతోంది. ఆమెకు పోటీగా అఖిల్ ఉన్నప్పటికీ ఓట్ల విషయంలో మాత్రం బిందు మాధవికి అతను పోటీ ఇచ్చే అవకాశమే లేదు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా బిందుమాధవి టైటిల్ విన్నర్ అని తెలిసిపోతుంది.

    చరిత్ర సృష్టించినట్లే..

    చరిత్ర సృష్టించినట్లే..

    బిందుమాధవి మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ అమ్మాయి కూడా ఫైనల్ లో గెలిచింది లేదు. గతంలో గీతామాధురి శ్రీముఖి ఇద్దరు కూడా ఫైనల్స్ కు వచ్చినప్పటికీ కూడా వారు టైటిల్ విన్నర్ గా నిలువలేక పోయారు. అందుకే బిగ్ బాస్ పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మగవాళ్లే ఆధిపత్యమే కొనసాగుతోంది అని కామెంట్స్ కూడా వచ్చాయి.

    బిందుమాధవి తరువాత..

    బిందుమాధవి తరువాత..

    ఈసారి బిందుమాధవి తప్పకుండా టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె తన కెరీర్ లోనే బిగ్ బాస్ ద్వారా అత్యధిక ఆదాయం కూడా అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక అఖిల్ సార్ధక్ మరొకసారి ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి రన్నరప్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత యాంకర్ శివ అని అంటున్నారు కానీ మిత్రశర్మ కూడా మూడో స్థానంలో నిలిచే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Bigg boss non stop telugu bindu madhavi first female contestant winning record,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X