Bigg Boss Non Stop: ఈసారి ఫైనల్ లో టాప్ 5 కాదు.. అంతకుమించి.. టాప్ లో ఎవరంటే?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకు సరికొత్త గొడవలతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న తొమ్మిది మందిలో ఎవరు టాప్ ఫైవ్ లో కి వెళ్తారు అనేది నిన్నటి వరకు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రొటీన్ గా కాకుండా అంతకంటే ఎక్కువ మందిని ఫైనల్స్ లోకి తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ అందించాలని మిగిలిన రెండు వారాల్లో ఊహించని ఎలిమి నేషన్స్ తో మరింత ఆసక్తికరంగా మార్చాలి అని చూస్తున్నారు. ఇక ఫైనల్స్ కు ఎంతమంది వెళ్తారు? ఎవరెవరు వెళతారు? అనే వివరాల్లోకి వెళితే..

అషు పాప అవుట్!

అషు పాప అవుట్!

పదవ వారంలో కి అడుగు పెట్టిన బిగ్ బాస్ ఈసారి ఎలిమి నేషన్స్ విషయంలో పెద్దగా సీక్రెట్ మెయింటైన్ చేయలేకపోయిన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సారి కూడా ఎలిమినేషన్ ఎపిసోడ్ కంటే ముందే ప్రేక్షకులు హౌస్ లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు మొదట్లో కొంత తడబడినా కూడా ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్ళిపోతున్నారో ముందే తెలిసిపోతుంది. ఇక ఈ సారి అషు రెడ్డి వెళ్లి పోవడం ఖాయమని అర్థం అవుతోంది.

ఓట్లల్లో భారీ మార్పులు

ఓట్లల్లో భారీ మార్పులు

ఇక మొత్తం హౌస్ లో తొమ్మిది మంది ఉండగా అషు రెడ్డి వెళ్ళిపోతే మిగతా ఎనిమిది మందిలో ఎవరు ఫైనల్స్ వరకు వెళతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మిగిలిన వారిలో అందరూ కూడా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ప్రేక్షకుల్లో వారి మద్దతు కూడా పెరుగుతోంది. ఇక వారం వారం ఓట్ల విషయంలో కూడా చాలా నెంబర్లు మారిపోతున్నాయి.

అత్యధిక ఓట్లు అందుకున్న వారు..

అత్యధిక ఓట్లు అందుకున్న వారు..

గత వారం రోజులు కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రేక్షకుల మద్దతుగా గెలుచుకోవడానికి గట్టిగానే ప్రయత్నించారు. అయితే అషు రెడ్డి కష్టం మాత్రం పెద్దగా ఫలించలేదు. దీంతో ఆమె ఈసారి చాలా తక్కువ ఓట్లతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత బిందుమాధవి అతనికి గట్టి పోటీని ఇస్తోంది.

ఆమెకు అతి తక్కువగా..

ఆమెకు అతి తక్కువగా..

3వ స్థానంలో యాంకర్ శివ ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతుండగా అనంతరం మిత్రశర్మ 4వ స్థానంలో కి వచ్చేసింది. ఇక అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో అరియానా ర్యాంకు పడిపోయింది. దీంతో ఆమె ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత అనిల్ ఆరో స్థానంలో నిలిచాడు. అతి తక్కువ ఓట్లు వచ్చిన అషు రెడ్డి ఏడవ స్థానంలో కొనసాగుతూ ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధమైంది.

ఈసారి ఫైనల్స్ మరింత ఆసక్తికరంగా..

ఈసారి ఫైనల్స్ మరింత ఆసక్తికరంగా..

అయితే ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ఫైనల్ ఎపిసోడ్ తో ముగించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సారి కూడా ఆట తుది దశకు వచ్చేసరికి టాప్ ఫైవ్ లిస్టు ని ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువగా మొత్తంగా ఆరుగురిని ఫైనల్ సిక్స్ ఓకే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టాప్ 6లో ఉండేది ఎవరు?

టాప్ 6లో ఉండేది ఎవరు?

అయితే ఈసారి ఫైనల్స్ వరకు ఎవరెవరు వెళ్తారు అనే విషయం కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. అందులో టాప్ 6లో ఉండేవాళ్ళు వీరే అని అంటున్నారు. అఖిల్ సార్ధక్, బిందుమాధవి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అరియానా, అనిల్.. తప్పకుండా టాప్ 6లో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలిన మిత్ర శర్మ వచ్చేవారం ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X