Bigg Boss Non Stop: ఎలిమినేషన్ లో నాగార్జున ఉహించని ట్విస్ట్.. సందిగ్ధంలో పడిన బాబా భాస్కర్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్న వారు ఎలాగైనా ఫైనల్స్ వరకు నిలదొక్కుకోవాలి అని టైటిల్ విన్నర్ గా నిలవాలని అనుకుంటున్నారు. ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ప్రతి ఒక్కరు ఈ విషయంలో కూడా ఊహించని నిర్ణయాలను తీసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు నాగార్జున మొదట కంటెస్టెంట్స్ అందరిని కూడా సరదాగా ఆటపాటలతో అలరిస్తూనే చివరలో ఎలిమినేషన్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది పూర్తి వివరాల్లోకి వెళితే..

సన్ డే ఫన్ డే

సన్ డే ఫన్ డే

ఇక ఆదివారం రోజున నాగార్జున మొదట సండే ఫన్ డే మార్నింగ్ అంటూ అందరితో స్టెప్పులు వేయించారు. అదిరిపోయే క్రేజీ సాంగ్స్ కు తగ్గట్టుగా డాన్స్ కూడా చేయించారు. మొదట లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రేమో అంటూ కంటెస్టెంట్స్ అందరూ కూడా డాన్స్ చేశారు. ముఖ్యంగా శివ డ్యాన్స్ నాగార్జున ఎంతగానో నవ్వించింది.

నాగార్జున సెటైర్

యాంకర్ శివ అలా మూన్ వాక్ చేయగానే మరొకసారి చేసి చూపించవా అని నాగార్జున అడిగాడు. అది ఎలా ఉందో తెలుసా అంటూ చిన్నపిల్లాడు జేబులో నుంచి పావలా కింద పడిపోతే తీసుకుంటున్నట్లుగా ఉంది అని సెటైర్ వేయడం జరిగింది. ఇక ఆ తర్వాత పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం అంటూ యాంకర్ శివ మరో పాట అందుకున్నాడు. ఇక నాగార్జున పావురం ఎవరూ పంజరం ఎవరు అని అడగగా యాంకర్ శివ తాను పంజరం అషు రెడ్డి పావురం అని వివరణ ఇచ్చాడు.

నాగార్జున ట్విస్ట్

నాగార్జున ట్విస్ట్

ఇక ఫైనల్ గా నామినేషన్స్ చివరలో ఉన్న అషు రెడ్డి అరియానా ఇద్దరిలో ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు అనే విషయంలో కూడా నాగార్జున ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అందుకు ఆయన బాబా భాస్కర్ ను మధ్యలో ఇరికించేశారు. ఆయన గత వారం ఏవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వారం అయినా వాడొచ్చు ఆ తర్వాత అయినా వాడొచ్చు అంటూ.. మీ కోసం అయినా వాడొచ్చు మరొకరి కోసం అయినా వాడొచ్చు అని అన్నారు.

బాబా భాస్కర్ పాస్.. ఎవరికి?

బాబా భాస్కర్ పాస్.. ఎవరికి?

అయితే బాబా భాస్కర్ దగ్గర ఉన్న పాస్ ఉపయోగించి ప్రస్తుతం ఎలిమినెషన్స్ చివరలో ఉన్న అషు రెడ్డి, అరియానా ఇద్దరిలో ఎవరినో ఒకరిని సేవ్ చేయాలని అనుకుంటే ఎవరిని సేవ చేస్తారని నాగార్జున అడిగారు. ఇక బాబా భాస్కర్ ఎవరిని సేవ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆమె వెళ్లిపోవడం పక్కా..

ఆమె వెళ్లిపోవడం పక్కా..

ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో పెద్దగా సస్పెన్స్ అయితే ఏమీ లేదు. మొదట మిత్రశర్మ వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె గత వారం జరిగిన పరిణామాలతో తన ఓట్ల సంఖ్య భారీగా పెంచుకుంటుంది. ఇక చివరికి ఈ వారం ఎలిమినేషన్ ఎఫెక్ట్ అయితే అషు రెడ్డి పైన పడినట్లుగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X