Bigg Boss Non Stop: బిందుమాధవితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది.. అతను వెళ్లిపోవడం పక్కా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మరికొన్ని రోజుల్లో ఫైనల్ విక్ లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. అందులో ముగ్గురు అయితే ఫైనల్ కు ఫిక్స్ అయినట్లే అని కూడా అనిపిస్తోంది. ఇక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టం కాబట్టి మిగతా వారు కూడా ఫైనల్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే ఈ క్రమంలో బిందుమాధవిని కావాలని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మరొక వ్యక్తి కూడా అదే తరహాలో మిస్టేక్ చేసి ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

డబుల్ ఎలిమినేషన్?

డబుల్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిగ్ బాస్ ఈ సారి సరికొత్త ట్విస్ట్ లతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ముఖ్యంగా ఫైనల్ వరకు వెళ్ళేది ఎవరు అనే విషయంలో అయితే సస్పెన్స్ గట్టిగానే కొనసాగుతోంది.

ఇంకా రెండు వారాలే మిగిలి ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో ఎవరు ఈ వారంలో వెళ్ళిపోతారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా టాక్ వస్తోంది.

బిందు, అఖిల్ పోటాపోటీగా..

బిందు, అఖిల్ పోటాపోటీగా..

ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు వారి బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జనాలు అయితే ఎక్కువగా ఒక ముగ్గురిపై ఫోకస్ చేస్తున్నారు. వారి ముగ్గురిలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బిందుమాధవి అలాగే అఖిల్ ఇద్దరు కూడా పోటాపోటీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక వారం అఖిల్ అత్యధిక ఓట్లు ఆ అందుకుంటే మరో వారం బిందు అత్యధిక ఓట్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

 ఆటలో భాగంగానే..

ఆటలో భాగంగానే..

ఇక ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ లో యాంకర్ శివ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతను కూడా బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అతని ఆట శైలి కూడా పూర్తిగా మారిపోయింది. మొదట ఎంతో స్నేహంగా ఉన్న బిందు మాధవి ని కూడా అతను కాస్త దూరం పెడుతున్నాడు. కావాలని కాకుండా ఆటలో భాగంగానే బిందుమాధవి తర్వాతనే పోటీ పడడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

నోరు జారిన నట్రాజ్ మాస్టర్

నోరు జారిన నట్రాజ్ మాస్టర్

అయితే అంతా సవ్యంగానే కొనసాగుతున్న సమయంలో నట్రాజ్ మాస్టర్ చేసిన తప్పు అతనికి పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా నట్రాజ్ మాస్టర్ నామినేషన్స్ లో అనవసరంగా నోరు జారడం అతనికి పెద్ద మైనస్ అయ్యింది. మొన్నటి వరకు బాగానే ఓట్లు అందుకున్న నట్రాజ్ మాస్టర్ ఈసారి బిందుమాధవి పై విరుచుకు పడటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

ఎలిమినేట్ అయ్యే అవకాశం..

ఎలిమినేట్ అయ్యే అవకాశం..

వచ్చేవారం అతన్ని కాపాడడం కూడా డౌట్ అని అనిపిస్తోంది. ఇక్కడి వరకు పోరాడుతూ వచ్చిన నట్రాజ్ మాస్టర్ ఒకే ఒక్క మిస్టెక్ తో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం బిందు మాధవిని కాకుండా వారి తండ్రిపై కూడా నట్రాజ్ మాస్టర్ అనవసరపు వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడినట్లు అయింది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఈ వారంలో తెలిసిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X