Bigg Boss Non Stop: నా పోరాటం ఆగదు.. ఎవరిని వదలను.. బయట కూడా నటరాజ్ మాస్టర్ ఆవేశం!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫైనల్స్ కు చేరుకునేందుకు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. గతంలో మంచి స్నేహితులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ఇక ఊహించినట్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మోసం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే..

 అదే పెద్ద మైనస్

అదే పెద్ద మైనస్


బిగ్ బాస్ హౌస్ లో 11 వారాల పాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ మొత్తానికి ఇటీవల జరిగిన గొడవల కారణంగా ఇంట్లో నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఎక్కువగా బిందుమాధవి కారణంగానే అతను హౌస్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. అనవసరంగా ఆమె పై చేసిన వ్యాఖ్యలు కూడా అతనికి పెద్ద మైనస్ గా మారాయి. మరోవైపు అఖిల్ తో కూడా అతను చివరి నిమిషంలో గొడవ పడడం కూడా మరొక మైనస్ అని చెప్పాలి.

అసలైన విన్నర్..

అసలైన విన్నర్..


బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు రాగానే నటరాజ్ ప్రత్యేకంగ రిసీవ్ చేసుకోవడానికి కొంత మంది ఫ్యాన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అందులో లోబో కూడా ఉండడం విశేషం. అలాగే బిగ్ బాస్ 5 పాల్గొన్న మరో కంటెస్టెంట్ ఉమ కూడా నటరాజ్ మాస్టర్ కు ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పారు. వీరిద్దరు కూడా నట్రాజ్ మాస్టర్ విన్నర్ అని అసలైన ప్రశంసలు కురిపించారు.

బిందుమాధవిపై సోలోగా..

బిందుమాధవిపై సోలోగా..

బిందుమాధవి తనపై చేసిన ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ నేను తన తండ్రి పై చేసిన కామెంట్స్ ఒక విధంగా తప్పు కావచ్చు.. కానీ ఆమె కూడా తన కూతురు పై చేసిన కామెంట్స్ కారణంగానే ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది. అంతేకాకుండా నన్ను ఎంతగానో బూతులు తిట్టిందని.. తూ అని ఉమ్మేసిందని అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా సోలో ఫైట్ చేశాను అని మాస్టర్ వివరణ ఇచ్చాడు.

వెన్నుపోటు పొడిచారు..

వెన్నుపోటు పొడిచారు..

అయితే తనకు కొంతమంది క్లోజ్ గా ఉన్నట్లే ఉండి నన్ను వెన్నుపోటు పొడిచారు అంటూ వాళ్లు ఎంత నన్ను మోసం చేసినప్పటికీ కూడా నేను మాత్రం నిజాయితీగానే ఉన్నాను. నేను అయితే మిగతా వారిలాగా దొంగదెబ్బ కొట్టలేదు. ఎదురుగా వెళ్లి ఆడాను. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఆ విషయంలో నా కూతురు మా డాడీ హీరో అని చెప్పుకో గలుగుతుంది. అలాగే కొంతమంది విషయంలో ఏం జరిగింది అనేది కూడా నేను త్వరలోనే మాట్లాడతాను అని అన్నారు.

 పోరాటం ఆగదు

పోరాటం ఆగదు

అలాగే నన్ను 11వ వారం వరకు కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకవిధంగా నాకు ఫ్యాన్స్ లేకపోవచ్చు అని హౌస్ లో ఉన్నప్పుడు అఖిల్ తో కూడా చెప్పాను. వారందరూ కూడా ఎంతో అభిమానంతో నాకు సపోర్ట్ చేసిన విధానం నచ్చింది. ఇక నా పోరాటం అయితే ఇప్పటితో ఆగదు. అలాగే నన్ను వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది.. అని అన్నారు.

 రివెంజ్ పక్కా..

రివెంజ్ పక్కా..

అలాగే నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిన వారి పై కూడా నేను పోరాటం చేస్తాను. ఇప్పట్లో అయితే నా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. నన్ను ఎలాగైతే బయటకు తీసుకువచ్చారో అలాగే వారందరినీ కూడా బయటకు తీసుకు వచ్చే వరకు కూడా నేను తగ్గను అంటూ మాస్టర్ చాలా గట్టిగా చెప్పారు. లోపల ఉన్న బయట ఉన్నా కూడా తాను ఎప్పుడు సింహమే అంటూ లోబో తరహాలో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగిందని ప్రస్తుతం ఉన్న వారు ఎవరు కూడా సరైన ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేకపోయారు అని నటరాజ్ మాస్టర్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X