Bigg Boss Non Stop: ఓ వైపు అఖిల్ దెబ్బ మరోవైపు బిందు దెబ్బ.. ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఫైనల్ దశకు చేరువవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నామినేషన్లలో కూడా గొడవలు హై రేంజ్ లో కొనసాగుతున్నాయి. డేంజర్ జోన్ లో ఉన్న వారు సేఫ్ జోన్ లోకి రావడానికి టాస్క్ లలో గొడవలకు దిగుతున్నారు. ఇక ఇటీవల నోటి దురుసు కారణంగా ఒక కంటెస్టెంట్ ఉహించని విధంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ లో ఈ వారం ఒక ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు టాక్. ఆ వివరాల్లోకి వెళితే...

నెంబర్ వన్..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో స్టార్ట్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. అసలు మళ్ళీ పాత కంటెస్టెంట్స్ ను ఎందుకు తీసుకు వచ్చారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ వారిలో కొందరు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది. ముఖ్యంగా అఖిల్ ప్రతీ వారం కూడా అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

ఊహించని ట్విస్ట్..
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందుగా అయితే మిత్రశర్మ హౌస్ లో నుంచి ఈ వారం వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. అంతే కాకుండా మిగతా కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు అనిపించింది. అయితే వారెవరూ కూడా వెళ్లకుండా బలమైన కంటెస్టెంట్ వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది.

గెలిచేది ఎవరంటే?
ఇక అఖిల్, బిందుమాధవి టాప్ లిస్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతీ వారం అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో వీరు ఇద్దరు కూడా టాప్ లిస్టులో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా అయితే బిందుమాధవి గెలిచే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

డబుల్ ఎలిమినెషన్స్
ఇక ఈ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినెషన్స్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక అందులో నటరాజ్ మాస్టర్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ ఈ సారి ఎలాగైనా టైటిల్ విన్నర్ గా నిలవాలని చాలా కష్టపడుతున్నాడు గోడవపడుతున్నాడు. కానీ అవేవి కూడా అతనికి సరైన ఫలితం ఇవ్వడం లేదు. ప్రతీసారి ఆయన గొడవ కూడా ఓ వర్గం వారికి చిరాకు తెప్పిస్తున్నాయి.

నటరాజ్ కు దెబ్బ?
అసలే అఖిల్, బిందుమాధవి ఇద్దరు కూడా టాప్ లిస్టులో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నారు. అయితే అలాంటి వారితో గ్యాప్ లేకుండా గొడవలు పెట్టుకున్నాడు. పోనీ అందులో ఏదైనా న్యాయంగా అయినా ప్రశ్నించారా అంటే అది లేదు. ఒక విధంగా బిందుమాధవి, అఖిల్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం నటరాజ్ మాస్టర్ పై ప్రభావం పడినట్లు సమాచారం. అందుకే ఆయన ఈ వారం వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











