Bigg Boss Non stop: మళ్ళీ మారిపోతున్న లెక్కలు.. టాప్ 3లో వాళ్లేనాట.. చివరలో బిందుమాధవి?
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో జరుగుతున్న పరిణామాలు రోజురోజుకు ఆసక్తిని ఎంతగానో పెంచుతున్నాయి. ఇక గత కొన్ని వారాలుగా ఈ సీజన్లో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేది ఎవరు అనే విషయం లో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అందులో ఎక్కువగా మొదట బిందుమాధవి పేరు వినిపించింది. ఆ తర్వాత అఖిల్ పేరు కూడా వైరల్ అవుతోంది. ఇక మధ్యలో మరొక వ్యక్తి పేరు కూడా బాగానే వైరల్ అవుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఓట్ల లెక్కింపు ప్రకారం టాప్ 3లో కొనసాగే లిస్ట్ ఇదే అని.. ఇక చివర్లో బిందు మాధవి ఉంటుంది అని కూడా అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జాగ్రత్తగా వెళుతున్న బిందుమాధవి
బిగ్ బాస్ లో ఎంత బలమైన కంటెస్టెంట్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు చిన్న పొరపాటు వలన మళ్ళీ అతని ర్యాంక్ పడి పోతూ ఉండటం సహజం. బిగ్ బాస్ ఆటలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే ఫలితం దక్కుతుంది. ఆవిషయంలో బిందుమాధవి మాత్రం మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

అఖిల్ vs బిందుమాధవి
ఈ సీజన్లో ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్న వారిలో బిందుమాధవి పేరు కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. అయితే ఆమెకు పోటీగా మరికొంతమంది కూడా నిలుస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా అఖిల్ నుంచి బిందుమాధవికి బలమైన పోటీ ఎదురవుతోంది. వీరిద్దరూ కూడా టాప్ ఫైనల్స్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి కూడా టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ లాజిక్ గేమ్
గతంలోనే ఒకసారి బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వచ్చి రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్ధక్ ఈసారి మాత్రం ఫైనల్స్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా గెలవాలని అనుకుంటున్నాడు. రోజురోజుకు అతని స్ట్రాటజీ కూడా మారిపోతుంది. గతంలో కంటే ఈసారి కాస్త ఎక్కువగానే ప్రవర్తిస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి గొడవలో కూడా లాజిక్ వెతుకుతూ మిగతా వారికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

బిందుమాధవి.. అడపులి
ఇక అఖిల్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా బిందుమాధవి మాత్రం బయట ప్రపంచం లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పేరు నిత్యం వైరల్ అవుతూనే ఉంది మొన్న బిందు మాధవి ఆడ పులి అనే ఒక ట్విట్టట్ ట్యాగ్ కూడా బాగానే ట్రెండ్ అయింది. దీన్నిబట్టి ఆమె రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.

టాప్ 3లో ఉండేది వీళ్లే..
ఇక అఖిల్ బిందుమాధవి ఇద్దరు కూడా ప్రతి టాస్క్ లోను హాట్ టాపిక్ గానే నిలుస్తున్నారు. ఎక్కువగా వీరి మధ్య బిగ్ బాస్ కూడా పోటీ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మధ్యలో యాంకర్ శివ కూడా తనదైన శైలిలో హైలెట్ అవుతూ వస్తున్నాడు. అవసరమైన ప్రతిసారీ కూడా బిందు మాధవికి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గేమ్ లో భాగంగానే ఆమెకు గట్టి పోటీని కూడా ఇస్తున్నాడు. ఇక ఈ సారి టాప్ 3 కంటెస్టెంట్స్ లో బిందుమాధవి చివరలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ మొదటి స్థానంలో ఆ తర్వాత యాంకర్ శివ, చివరలో బిందుమాధవి మూడవ స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











