Don't Miss!
- News
Lady: భర్త చనిపోయాడు, లేడీకి కోరికలు పుట్టించి అక్రమ సంబంధం, ఆఫీసులో లేడీ ఆత్మహత్య, లెటర్ !
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Bigg Boss Non Stop: ప్రత్యేక అతిథిగా సీనియర్ హీరో.. వై కొట్టుడు అంటూ బిందుమాధవి కామెంట్!
బిగ్ బాస్ నాన్ స్టాప్ రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. ఫైనల్ స్టేజ్ కు రావడంతో టాప్ ఫైవ్ లో కి ఎవరు వెళ్తారు అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే టాప్ 3 కంటెస్టెంట్స్ ఫిక్స్ అయినట్లుగా ప్రేక్షకుల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఏర్పడింది. ఇక ఫైనల్ స్టేజ్ కి వస్తున్న తరుణంలో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా పెంచుతున్నాడు. ఇక ప్రత్యేకంగా షో లోకి ఒక సీనియర్ హీరో కూడా ప్రత్యేక అతిథిగా రావడం విశేషం. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చివరి నిమిషంలో..
బిగ్ బాస్ షో దాదాపు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలి అని చాలా కష్టపడుతున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇతరులకు గట్టిపోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకునే అర్హత ఉన్న వారు కూడా ఈ వారం చివరి నిమిషంలో వెళ్లిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది కూడా వస్తోంది.

ప్రత్యేక అతిథిగా..
ఇక బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కి వెళ్తున్న తరుణంలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం ప్రత్యేక అతిథిగా ఒక సీనియర్ హీరో ఆయన భార్యతో కలిసి ప్రత్యేకంగా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడం విశేషం. వచ్చే వారం కూడా బిగ్ బాస్ లోకి మరొక ప్రముఖ హీరో వచ్చే అవకాశం ఉన్నట్లు తతెలుస్తోంది.

జీవిత రాజశేఖర్..
ఇక ఈ వారం స్పెషల్ గెస్ట్ గా సీనియర్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ జీవితతో కలిసి బిగ్ బస్ లోకి అడుగు పెట్టారు. వారు శేఖర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షోలో పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక వారు రాగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా హుషారుగా కనిపించారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు అనగానే అరియానా విన్నారా బిగ్ బాస్ అంటూ కాస్త హైలెట్ అయ్యే ప్రయత్నం చేసింది. అందుకు రాజశేఖర్ ఆశ్చర్యపోయారు.

టాలెంట్ చూపించిన కంటెస్టెంట్స్
ఇక హామీదా కూడా తన టాలెంట్ చూపించే ప్రయత్నం చేసింది. స్కూటర్ నడుపుకుంటు వచ్చి ఇంగ్లీష్ లో ఫన్నీ గా మాట్లాడింది. ఇక వచ్చి రాని ఇంగ్లీష్ తో యాంకర్ శివ బిందుమాధవితో స్కిట్ చేశాడు. ఇలా ఆయిల్ పెట్టి కొట్టాలి అని ఎదో చెబుతుండగా వై కొట్టుడు అంటూ బిందుమాధవి ప్రశ్నించింది. ఇక వారి మాటలకు రాజశేఖర్ గట్టిగా నవ్వేశారు.
Recommended Video

స్పెషల్ డ్యాన్స్
ఇక కంటెస్టెంట్స్ అందరితో కలిసి రాజశేఖర్ స్టెప్పులు వేశారు. ప్రత్యేకంగా బాబా భాస్కర్ తనదైన స్టైల్ లో స్టార్ హీరోతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇక చూస్తుంటే ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఇదే హైలెట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ ఈ వారంలో ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్, మిత్ర బింద కూడా వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.