Bigg Boss Non Stop : ఎలిమినేషన్స్ లో ట్విస్ట్.. ఇద్దరు అవుట్ అయ్యే అవకాశం.. కానీ?
బిగ్ బాస్ నాన్ స్టాప్ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడో వారం చివరికి చేరింది. సాధారణంగా ఈ షోలో ప్రతి వారాంతం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈ వారం ఎలిమినేషన్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

భిన్నంగా నామినేషన్ ప్రక్రియ
బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ చాలా భిన్నంగా జరిగింది. జంటలు జంటలుగా విడిపోయి మరీ హౌస్ మేట్స్ నామినేషన్స్ లో వాదించుకున్నారు. ఈ వాదనలో ఇద్దరిద్దరుగా వెళ్లిన అఖిల్ - బిందు ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అలాగే, నటరాజ్ మాస్టర్ - యాంకర్ శివ ఇద్దరూ కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అలా ఆ నలుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.

టైటిల్ రేసులో
అలాగే అషూరెడ్డి ఉపయోగించిన స్పెషల్ పవర్ వల్ల మహేష్ విట్టా కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు. అలాగే మిత్రా-అరియానా కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక ఈ వారం అన్ అఫీషియల్ ఓటింగ్ ని పరిశీలిస్తే ఎప్పటిలాగానే బిందు మాధవి టాప్ లో ఉంది. అలాగే అఖిల్ కూడా బిందు మాధవికి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. వీరిద్దరూ ఖచ్చితంగా ఇలాగే ఇంకొన్ని వారాలు ఉంటే టైటిల్ రేసులో నిలబడతారని చెప్పక తప్పదు.

డేంజర్ జోన్ లో
వీరి తరువాత యాంకర్ శివ కూడా తన ఓటింగ్ ని మెరుగుపరుచుకుని దూసుకు వెళుతున్నాడు. ఉన్నాడు. వీళ్ల ముగ్గురూ ఖచ్చితంగా సేఫ్ అవుతారు. అయితే అరియానా కూడా కొంచెం సేఫ్ గానే ఉందని అంటున్నారు. ఇక ఉన్న వారిలో మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మా ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, ఈసారి అనూహ్యంగా ఒక స్పెషల్ ట్విస్ట్ ఉండనుందని అంటున్నారు.

సీక్రెట్ రూమ్ కు
ఈవారం ఫ్యామిలీ ఎపిసోడ్ ఉండనుంది. ఈ క్రమంలో నామినేషన్ల లో ఉన్న వారిలో ఒకవేళ తక్కువ వోటింగ్ వచ్చినా సరే నటరాజ్ మాస్టర్ ను కానీ మిత్రా శర్మను కానీ ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ చిన్నపాపను తీసుకువచ్చి మంచి ఎమోషనల్ కంటెంట్ పుట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ ఎలిమినేట్ అయ్యే అవకాశం వచ్చినా సీక్రెట్ రూమ్ కు తీసుకు వెళ్లే అవకాశం ఉంది.
Recommended Video


వచ్చే వారం ఇద్దరిని
ఇక మిత్రాది కూడా సేమ్ పరిస్థితి. ఎందుకంటే మిత్రా తండ్రి చనిపోయారు. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. ఆమె కోసం ఆమె స్నేహితులే ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మిగతా వారి కుటుంబ సభ్యులను చూసి ఆమె కంట తడి పెట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేయాల్సి వచ్చినా చేయరని అంటున్నారు. మిత్రాను కూడా కుదిరితే సీక్రెట్ రూమ్ కు పంపుతారు కానీ ఎలిమినేట్ చేసే అవకాశం ఉండదని అంటున్నారు. ఇక మహేష్ విట్టాను కూడా అలాగే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్స్ ఉండకపోవచ్చని దాని బదులు వచ్చే వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











