Bigg Boss Non Stop: షోలోకి ఇద్దరు బడా సెలెబ్రిటీలు ఎంట్రీ.. మాజీ విన్నర్‌తో పాటు హీరోయిన్ కూడా!
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. ఏ భాషలోనైనా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఏకంగా ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇది గత సీజన్ల కంటే ఎక్కువ మజానే అందిస్తూ వస్తోంది. దీన్ని మరింత ఎక్కువ చేయడానికి ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఇద్దరు బడా సెలెబ్రిటీలను తీసుకు వస్తున్నారని తెలిసింది. అందులో ఒకరు మాజీ విన్నర్ కాగా.. మరొకరు హీరోయిన్ అంటున్నారు. ఆ వివరాలు మీకోసం!

సక్సెస్‌ఫుల్‌గా బిగ్ బాస్ నాన్ స్టాప్
తెలుగులో బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అవడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా నాన్ స్టాప్‌గా వినోదాన్ని పంచుతూనే ఉంది.

6 వారాల్లో... ఆరుగురు ఎలిమినేట్
తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు ఎలిమినేట్ అయిపోయారు.

బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
ఈ రియాలిటీ షో అంటేనే ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇక, ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఎంతో మంది గెస్టులు వస్తారని అంటున్నారు. అంతేకాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని వార్తలు వస్తూనే ఉన్నాయి.

కొత్త వాళ్లతో పాటు మాజీల పేర్లు
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా కొత్త మోడళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

సెలెబ్రిటీలనూ అలా దించేస్తూ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మరింత ఫన్నీగా నడిపించేందుకు నిర్వహకులు గట్టి ప్లాన్లనే వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను సైతం హౌస్‌లోకి పంపారు. అందులో రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ, సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, యాంకర్ సుమ ఇలా పలువురు సందడి చేశారు. ఇలా ఇంకొంత మంది కూడా రాబోతున్నారని అంటున్నారు.

ఇద్దరు బడా సెలెబ్రిటీలు కూడా
ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మరింత రంజుగా మార్చేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే షోలోకి మరికొందరు సెలెబ్రిటీలను తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ వారం చివర్లో మరో ఇద్దరు సెలెబ్రిటీలు ఎంట్రీ ఇస్తున్నారని తెలిసింది.
Recommended Video


మాజీ విన్నర్‌తో పాటు హీరోయిన్
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ వారం చివర్లో షోలోకి మాజీ విన్నర్ వీజే సన్నీ ఎంట్రీ ఇస్తున్నాడట. అతడితో పాటు మరో హీరోయిన్ కూడా రాబోతుందట. అయితే, ఆమె ఎవరన్నది మాత్రం తెలియలేదు. వీళ్లు పర్మినెంట్‌గా హౌస్‌లో ఉండడానికి రావడం లేదు. శనివారం ఎపిసోడ్‌ను మరింత ఫన్నీగా మార్చడానికి ఎంటర్ కాబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











