Bigg Boss Non Stop Winner: ఫినాలేలో ఊహించని ఓటింగ్.. టాప్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలో ప్రారంభమైన షోనే బిగ్ బాస్. కొంత మంది కంటెస్టెంట్లను ఒక ఇంట్లో ఉంచి.. వాళ్లకు టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించడమే ఈ షో సారాంశం. దేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే దీనికి నేషనల్ రేంజ్‌లో రేటింగ్ దక్కుతోంది.

దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇప్పుడిది ఫినాలే స్టేజ్‌కు చేరుకోవడంతో ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఇందులో ఎవరు టాప్‌లో ఉన్నారో చూద్దాం పదండి!

చివరి దశలో మరింత రంజుగా

చివరి దశలో మరింత రంజుగా

భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఊహించినట్లుగానే సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలను చూపించారు. దీంతో పాత సీజన్ల కంటే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇప్పుడిది ఫినాలే వీక్‌కు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో రంజుగా నడుస్తోంది.

ఇప్పటికే 11 మంది ఎలిమినేట్

ఇప్పటికే 11 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డి, నటరాజ్‌లు ఎలిమినేట్ అయిపోయారు.

ఫినాలే వీక్.. టాప్ 7 ఎవరంటే

ఫినాలే వీక్.. టాప్ 7 ఎవరంటే


ఆరంభం నుంచే ప్రేక్షకులకు భారీ స్థాయిలో మజాను పంచిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్.. ఎన్నో ఊహించని ఎలిమినేషన్స్ తర్వాత ఫినాలే వీక్‌కు చేరుకుంది. ఆదివారం ముగిసిన ఎలిమినేషన్‌ తర్వాత హౌస్‌లో మిగిలిన బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివలు టాప్ 7గా నిలిచి ఫినాలేకు చేరుకున్నారు.

ఓటింగ్ మొదలు... 4 రోజులు

ఓటింగ్ మొదలు... 4 రోజులు

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విజేతను నిర్ణయించే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన ఓటింగ్ లైన్స్‌ను ఆదివారం రాత్రి నుంచి ఓపెన్ చేశారు. ఈ ఓటింగ్ ప్రాసెస్‌ను మునుపటిలా శనివారం రాత్రి వరకూ కొనసాగించడం లేదు. ఇది కేవలం బుధవారం రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే కొనసాగుతుందని బిగ్ బాస్ నిర్వహకులు ప్రకటించారు.

వాళ్లిద్దరి మధ్య నువ్వా నేనా

వాళ్లిద్దరి మధ్య నువ్వా నేనా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 18 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఇద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకున్నారు. వారిలో ఒకరు నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్‌ కాగా.. మరొకరు ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి. వీళ్లిద్దరూ ఇప్పటికే పలుమార్లు ఎలిమినేషన్ తప్పించుకున్నారు. టైటిల్ ఫైట్ వీళ్లిద్దరి మధ్య జరుగుతోంది.

 ప్రస్తుతానికి టాప్‌లో ఎవరంటే

ప్రస్తుతానికి టాప్‌లో ఎవరంటే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విజేత ఎవరో నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ యమ ఆసక్తికరంగా సాగుతుందని ఓ న్యూస్ లీకైంది. ఇందులో అఖిల్ సార్థక్, బిందు మాధవి మధ్య భీకరమైన పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోందట. కొద్దిసేపు అఖిల్ మొదటి స్థానంలో ఉంటే.. కొద్ది సేపు బిందు మాధవి టాప్‌లో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే బిందూనే మొదటి స్థానంలో ఉందని టాక్.

తర్వాతి స్థానాల్లో ఎవరున్నారు

తర్వాతి స్థానాల్లో ఎవరున్నారు


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫినాలే వీక్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, యాంకర్ శివ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, బాబా భాస్కర్ ఐదో స్థానంలో, మిత్రా శర్మ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్‌లు ఏడో స్థానంలో ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

 ఎన్నో సర్‌ప్రైజ్‌లతో కొత్తగానే

ఎన్నో సర్‌ప్రైజ్‌లతో కొత్తగానే

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు సంబంధించిన ఫినాలే వచ్చే శనివారం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఫినాలే వీక్‌లో భాగంగానే ఈ వారం మొత్తం ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని అంటున్నారు. మరీ ముఖ్యంగా గతంలో కంటే ఈ సారి కొత్తగా నడిపించబోతున్నారట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లు లోపలికి వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X