For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss బిందుమాధవి దూకుడు.. మరో రెండు సాలీడ్ ఆఫర్స్.. అస్సలు తగ్గట్లేదుగా!

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ షో టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందుమాధవి ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక ఓట్లు కూడా సొంతం చేసుకుంది. ఒక విధంగా ఆమెకు పోటీగా ఎంత మంది ఉన్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనను తాను నిరూపించుకుని టైటిల్ విన్నర్ గా నిలిచింది. అయితే బిందుమాధవి బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ బిజీ గా మారే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇటీవల మరో రెండు ప్రాజెక్టులను ఆమె దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  ఈ గెలుపుతో..

  ఈ గెలుపుతో..

  బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ద్వారా అందరి కంటే బిందు మాధవికి ఎక్కువగా క్రేజ్ ఉంది అనే చెప్పాలి. ఆమెకు పోటీగా అఖిల్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్స్ లో తన దూకుడును చూపించి నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. గెలిచినప్పుడు ఆమె చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయింది. ఇక ఈ గెలుపుతో తన కెరీర్ ను సెట్ చేసుకునే విధంగా ఆమె అడుగులు వేస్తోంది.

  బిందు బ్రేక్ చేస్తుందా?

  బిందు బ్రేక్ చేస్తుందా?

  సాధారణంగా బిగ్ బాస్ ద్వారా సక్సెస్ అయిన వారు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయటకు రాగానే వారికి చాలా ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షో ద్వారా టైటిల్ విన్నర్ గా నిలిచిన వారు ఇండస్ట్రీలో పెద్ద గా నిలదొక్కుకోలేకపోయారు. కానీ బిందు మాత్రం ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుంది అని తెలుస్తోంది.

  బాలయ్య సినిమాలో ఛాన్స్

  బాలయ్య సినిమాలో ఛాన్స్

  బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చిన ఆమెకు ప్రముఖ దర్శకుడు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో స్టార్ట్ చేయబోయే నందమూరి బాలకృష్ణ సినిమాలో బిందు మాధవికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తేల్చి చెప్పేశారు.

  నాన్ స్టాప్ ఆఫర్స్

  నాన్ స్టాప్ ఆఫర్స్

  అయితే బిందు మాధవి బిగ్ బాస్ నుంచి ఇంటికి రాగానే ఆమెకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె తొందరపడకుండా కేవలం తనకు సెట్ అయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంత వరకు మంచి కంటెంట్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా అనుకుంటోంది.

  లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్

  లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్

  ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకుంటున్న బిందుమాధవి కొన్ని రోజుల తర్వాత తనకు వచ్చిన ఆఫర్స్ గురించి ఆలోచించడానికి రెడీ అవుతోందట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు ఒక లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో కూడా ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ షో ద్వారా ఆడపులి గా మంచి గుర్తింపును అందుకున్న బిందుమాధవి అదే టైటిల్ తో సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నెటిజన్లు స్పందిస్తున్నారు.

   బిగ్ హీరో సినిమాలో..?

  బిగ్ హీరో సినిమాలో..?

  అలాగే మరొక అగ్రహీరో సినిమాలో కూడా బిందు మాధవి సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా కాకుండా సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచరం. త్వరలోనే ఆ ప్రాజెక్టు పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఆఫర్స్ తో బిందుమాధవి తన సినిమా కెరీర్ ను ఎంతవరకు సెట్ చేసుకుంటుందో చూడాలి.

  English summary
  Bigg boss non stop winner bindu madhavi another two offers in tollywood
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X