Bigg Boss Non Stop Winner: ముగిసిన ఓటింగ్.. ఫలించని సెలెబ్రిటీ ప్లాన్.. ఆ కంటెస్టెంటే విన్నర్!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చినా.. అందులో కొన్ని మాత్రమే విశేషమైన స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్ షోలుగా ఎదిగిపోతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఇండియాలోని చాలా భాషల్లో నడుస్తోన్నా.. తెలుగులో ప్రసారమయ్యే షోకు మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్ వస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఇది ఫినాలేకు చేరడంతో ఇందులో ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

జర్నీ వీడియోలతో సందడిగా
అనుకున్న దాని కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో సరికొత్త టాస్కులు, ఊహించని ఎలిమినేషన్స్, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, బోల్డు సన్నివేశాలు ఎక్కువగా కనిపించాయి. దీంతో ఇది మరింత హైలైట్ అయింది. ఇక, ఇప్పుడు ఇందులో కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు చూపిస్తూ మజా పంచుతున్నారు.

18 మందిలో వాళ్లంతా అవుట్
ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 18 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి 11 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్, హమీదా ఖటూన్, అషు రెడ్డి, నటరాజ్‌లు ఎలిమినేట్ అయ్యారు.

టాప్ 5 కాదు... 7 గురు ఎంట్రీ
సాధారణంగా బిగ్ బాస్ సీజన్లలో ఫినాలే రౌండ్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు చేరుతుంటారు. ఈ టాప్ 5లో నిలిచేందుకు కంటెస్టెంట్లు నానా కష్టాలను అనుభవిస్తారు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఐదుగురు కాకుండా ఏడుగురిని ఫినాలేకు పంపించారు. అందులో బిందు, మిత్రా, అఖిల్, బాబా, అనిల్, ఆరియానా, శివలు టైటిల్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

వాళ్లలో పోటీ ఇద్దరి మధ్యలో
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఏకంగా ఏడుగురు ఫినాలేకు చేరుకున్నారు. కానీ, ఇందులో కేవలం ఇద్దరి మధ్యలోనే టైటిల్ పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి కాగా, మరొకరు నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్. ఆరంభం నుంచే వీళ్లిద్దరూ చక్కని ఆటతీరుతో పాటు మైండ్ గేమ్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతూ వచ్చారు.

మారుతూ మారుతూ సాగుతూ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విన్నర్‌ను ప్రకటించే ఓటింగ్ ప్రక్రియ బుధవారం అర్ధరాత్రితోనే ముగిసిపోయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. ఇందులో కొద్దిసేపు అఖిల్ సార్థక్ టాప్‌లో ఉంటే.. మరికాసేపు బిందు మాధవి మొదటి స్థానంలో నిలిచేది. ఇలా తరచూ వీళ్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి. దీంతో విజేత ఎవరన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

చివరిలో టాప్‌కు చేరిన భామ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫినాలే ఓటింగ్ ముగిసే సమయానికి బిందు మాధవే టాప్‌లో ఉన్నట్లు తెలిసింది. అంటే ఈ సీజన్‌లో ఆమెనే విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అఖిల్ సార్థక్ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సిందే. అంతేకాదు, సెలెబ్రిటీలతో చేసిన ప్రచారం ప్లాన్స్ కూడా ఫెయిల్ అయినట్లే.

మిగిలిన వాళ్ల స్థానాలు ఇలా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫినాలే వీక్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి బిందు మాధవి, అఖిల్ సార్థక్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక, యాంకర్ శివ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, బాబా భాస్కర్ ఐదో స్థానంలో, మిత్రా శర్మ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్‌లు ఏడో స్థానంలో ఉన్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











