Bigg Boss Non Stop Winner: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఆ కంటెస్టెంట్‌దే నాన్ స్టాప్ టైటిల్!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఈ కార్యక్రమం ఐదేళ్లుగా మన టెలివిజన్‌పై సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. దీనికి ప్రేక్షుకులు భారీ మద్దతును అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ జోష్‌తోనే ఇప్పుడు 24 గంటలు ప్రసారం చేస్తూ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకుని వచ్చారు. అంచనాలను నిజం చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్.. ఇప్పుడు ఫినాలే వీక్‌కు చేరుకుంది. మరి ఇందులో ఎవరికి ఓటింగ్ ఎక్కువగా వస్తుంది? ఈ సీజన్‌లో విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం పదండి!

ఫినాలేకు చేరిన నాన్ స్టాప్ సీజన్

ఫినాలేకు చేరిన నాన్ స్టాప్ సీజన్

రెగ్యూలర్ బిగ్ బాస్ ఐదు సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలు ఇందులో చూపించడంతో ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా ఫినాలేకు చేరుకుని మరింత మజాను అందిస్తోంది.

షో నుంచి 11 మంది ఎలిమినేట్

షో నుంచి 11 మంది ఎలిమినేట్

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి 11 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డి, నటరాజ్‌లు ఎలిమినేట్ అయ్యారు.

ఫినాలేకు చేరిన 7గురు సభ్యులు

ఫినాలేకు చేరిన 7గురు సభ్యులు

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండానే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ఎన్నో ఊహించని ఎలిమినేషన్స్ తర్వాత ఫినాలే వీక్‌కు చేరుకుంది. ఇక, ఈ సీజన్‌కు గానూ బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ శివలు టాప్ 7గా నిలిచి ఫినాలేలో టైటిల్ బరిలో నిలిచారు.

ఓటింగ్ లైన్ 4 రోజులు మాత్రమే

ఓటింగ్ లైన్ 4 రోజులు మాత్రమే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో విజేత ఎవరన్న దానిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. ఇందుకోసం ఫినాలే వీక్ ఓటింగ్ ప్రక్రియను ఆదివారం రాత్రి నుంచే మొదలు పెట్టారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఓటింగ్ లైన్స్‌ను ఈ బుధవారం రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే కొనసాగించబోతున్నారు. దీనిపై నిర్వహకులు అధికారిక ప్రకటన ఇచ్చేశారు.

 ఇద్దరి మధ్యలోనే టైటిల్ పోరు

ఇద్దరి మధ్యలోనే టైటిల్ పోరు

తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ మేల్ కంటెస్టెంట్లే విజేతలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాత్రం ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి ఆరంభం నుంచే టైటిల్ బరిలో నిలిచింది. ఫలితంగా అంతకంతకూ క్రేజ్‌ను పెంచుకుని ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఆమెకు పోటీగా అఖిల్ సార్థక్ కూడా బిగ్ ఫైట్ ఇస్తోన్న విషయం తెలిసిందే.

ఓటింగ్ ఇలా... విజేతపై క్లారిటీ

ఓటింగ్ ఇలా... విజేతపై క్లారిటీ

మొదటి రోజు కాసేపు అఖిల్, కాసేపు బిందు మాధవి టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. రెండో రోజు మొత్తంగా బిందు మాధవికి భారీ స్థాయిలో ఓటింగ్ పెరిగిందట. దీంతో సోమవారం మొత్తం ఆమెనే టాప్‌లో కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదే కంటిన్యూ అయితే బిందు మాధవే ఈ సీజన్ విజేత అయ్యే అవకాశం ఉంది.

తర్వాతి స్థానాల్లో ఎవరెవరంటే

తర్వాతి స్థానాల్లో ఎవరెవరంటే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫినాలే వీక్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, యాంకర్ శివ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, బాబా భాస్కర్ ఐదో స్థానంలో, మిత్రా శర్మ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్‌లు ఏడో స్థానంలో ఉన్నారని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X